ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా ఉన్నపుడు కాజల్, సమంత, అనుష్క లాంటి వాళ్ళు ఎప్పుడూ ఏ అవార్డు ఫంక్షన్స్ కి వెళ్లినా హాట్ గా డ్రెస్ చేసుకుని.. అందచందాలతో గ్లామర్ షో చేస్తారు తప్ప స్టేజ్ ఎక్కి డాన్స్ వేసి ప్రేక్షకులను సెలబ్రిటీస్ ని అలరించింది లేదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు మాత్రం టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ అవార్డు ఫంక్షన్స్ లో తమ పెరఫార్మెన్స్ తో అలరించే హీరోయిన్స్ కూడా ఉన్నారు. చిన్న చిన్న హీరోయిన్స్ అయితే అవకాశాల కోసం స్టేజ్ మీద బోలెడన్ని డాన్స్ లు వేసి ఆకట్టుకోవడం ఎప్పటినుండో జరుగుతున్నదే. కానీ ఇప్పుడు ఒకప్పుడు టాప్ లో ఉండి ప్రస్తుతం ఒకటి అరా సినిమాలు చేస్తున్న హీరోయిన్ ఒకామె మొదటిసారి స్టేజ్ డాన్స్ తో ఇరగదీసింది.
ఆమె ఎవరో కాదు టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించిన ఒకప్పటి టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. కాజల్ తాజాగా కోలీవుడ్ లో జరిగిన విజయ్ అవార్డ్స్ లో హాట్ డ్రెస్ తో దుమ్ము రేపే పెరఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ప్రస్తుతం కాజల్ స్టేజ్ డాన్స్ షో ఫొటోస్ నెట్ లో వైరల్ అయ్యాయి. విజయ్ అవార్డ్స్ స్టేజ్ మీద కాజల్ ఊర మాస్ స్టెప్స్ తో అదిరిపోయే గ్లామర్ డ్రెస్ తో వేసిన డాన్స్ ఇప్పుడు కోలీవుడ్ అండ్ టాలీవుడ్ సర్కిల్స్ లోను హాట్ టాపిక్ అయ్యింది. మరి సినిమాల్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు తగ్గాక కాజల్ స్టార్ హీరో ఎన్టీఆర్ సినిమా జై లవ కుశ లోను ఐటెం సాంగ్ లో డాన్స్ చేసి అదరగొట్టి అందరికి షాక్ ఇచ్చింది.
మరి ఇప్పుడు అవకాశాల కోసమే కాజల్ ఇలా అవార్డ్స్ ఫంక్షన్ లో స్టేజ్ మీద డాన్స్ తో రఫ్ఫాడించిందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన అవకాశాలు రాక కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోస్ కి ఓకే చెప్పేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లలో కాజల్ కి ఓ అన్నంత అవకాశాలు రావడం లేదు. చూద్దాం ఇలాంటి పెరఫార్మెన్సెస్ తో కాజల్ కెరీర్ ఏమన్నా ఊపందుకుంటుందేమో.