తెలుగులో తన మొదటి సినిమాతోనే 'ఫిదా' చేసి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తో అందరి మనసులు గెలుచుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'పడి పడి లేచే మనసు' సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది. దాదాపు యాభై శాతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దీని తర్వాత ఇంకో సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యిపోయింది ఈ మలయాళీ కుట్టి.
'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆమె అంగీకరించింది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. అంతేకాకుండా.. 'ఓనమాలు' .. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన సెలెక్ట్ అయింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హీరో .. హీరోయిన్లకి గల క్రేజ్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.