అర్జున్‌రెడ్డి చిత్రంలోనే కాదు.. బయట కూడా అదే యాటిట్యూడ్‌తో మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ తనదైన శైలిలో విజయ్‌దేవరకొండ దూసుకెళ్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన చూపిన యాటిట్యూడే గాక నిజజీవితంలో కూడా ఆయన శైలిని నచ్చిన అభిమానులు బాగానే ఉన్నారు. ఇక ఈయన 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి', తాజాగా 'మహానటి' చిత్రాల ద్వారా హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. ఇక కొత్త దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'ట్యాక్సీవాలా' చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సివుంది. కానీ ఏవో కొన్ని కారణాల రీత్యా ఈ చిత్రం విడుదల వాయిదాలు పడుతోంది. దీనిని ఏకంగా గీతాఆర్ట్స్‌లో కలిసి యువి క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో కొంతభాగం సరైన అవుట్‌పుట్ రానందువల్ల మరలా రీషూట్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇలా వాయిదాలు పడటం మాత్రం ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిని కలిగించే విషయమే.
ఈయన ఫుల్‌లెంగ్త్‌రోల్ చేసిన 'అర్జున్‌రెడ్డి' విడుదలై ఏడాది గడుస్తున్నా ఈయన తదుపరి పూర్తి హీరోగా నటిస్తున్న చిత్రం విడుదల కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో పాటు ఆయన పరుశురామ్‌తో ఓ చిత్రం, అలాగే నోటా అనే ద్విభాషా చిత్రం వంటివి ఎన్నో ఒప్పుకున్నా ఏది ఏ స్టేజీలో ఉందో అప్‌డేట్స్ మాత్రం రావడం లేదు. ఇక తాజాగా విజయ్‌దేవరకొండ సోషల్ మీడియాలో ఓ సెల్ఫీలో మాట్లాడాడు. నేను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి జాబితాలోకి ఎంటర్ అయ్యాను. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ వంటి వారందరు ఎంతో గొప్పవారు. వారి చిత్రాలు చూస్తూనే నేను పెరిగాను. వాళ్లంతా ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఇక వారి తదుపరి తారక్, ప్రభాస్ వంటి వారి జనరేషన్ ఉంది. వాళ్ల తర్వాతే నేను. వాస్తవానికి వాళ్లతో పోల్చుకుంటే నేను ఓ బచ్చాగాడిని. అలాంటి వారితో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి కేటగిరీకి నేను కూడా నామినేట్ కావడం గొప్ప విషయం.
ఇదంతా చూస్తే నాకు అవార్డు వచ్చినంత ఆనందంగా ఫీలవుతున్నాను. నేను ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు వెళ్తున్నాను. నాతో పాటు ఒక అభిమానిని కూడా తీసుకెళ్తాను. నన్ను ఎవరైతే ఇష్టపడతారో వారు రౌడీక్లబ్. ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు ఇవ్వాలని కోరాడు. ఈ రౌడీక్లబ్ అనే వెబ్‌సైట్‌ని విజయ్‌దేవరకొండ తన సొంత వెబ్‌సైట్‌గా క్రియేట్ చేయడమే కాదు.. దానికి రౌడీక్లబ్ అనే వెరైటీ పేరును సెట్ చేసి తన యూటిట్యూడ్‌ని మరోసారి చూపించాడు.