'రేయ్' చిత్రాన్ని పక్కనపెడితే వరుసగా తన తొలి మూడు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్‌ని అందుకుని అనూహ్యంగా 25కోట్ల బిజినెస్ స్థాయికి మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ వెళ్లాడు. దాంతో చాలా మంది అతని ఫీచర్స్‌ని, మామయ్యలలాగా ఉండే బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ వంటి విషయాలలో ఆయనకున్న ఈజ్‌ని చూసి ఇతను స్టార్‌గా ఎదుగుతాడని భావించారు. కానీ 'సుప్రీం' తర్వాత ఈ హీరో ఖాతాలో ఆ స్థాయి హిట్ లేదు. వరుసగా ఐదు డిజాస్టర్స్‌ని ఆయన రుచిచూశాడు. ఇప్పుడు ఆయన కెరీర్ అత్యంత కీలక స్థితిలో ఉంది. మరో ఒకటి రెండు ఫ్లాప్‌లోస్తే ఆయన కెరీర్ మీదనే అది తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆయన తన చిన్న మామయ్య పవన్‌కి 'తొలిప్రేమ' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ వచ్చిన లవ్ చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో 'తేజ్ ఐ లవ్ యు' చిత్రం చేస్తున్నాడు. మంచి ఫీల్, స్క్రీన్‌ప్లేతో వస్తే పాత చింతకాయ పచ్చడి వంటి లవ్‌స్టోరీలను కూడా మన ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని గతంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. సరికొత్త ట్రీట్‌మెంట్‌తో చిత్రం తీస్తే ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు.
ఇక ఈ చిత్రం దర్శకుడు కరుణాకరన్‌కి చాలా గ్యాప్ తర్వాత మెగా హీరోతో చిత్రం చేస్తున్న సీనియర్ నిర్మాత, క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్ అధినేత కె.యస్.రామారావుకి కూడా కీలకం. కరుణాకరన్ విషయానికి వస్తే ఆయనకు 'తొలిప్రేమ' తర్వాత 'ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్' చిత్రాలు మాత్రమే అలరించాయి. ఆ తర్వాత వచ్చిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం బాగా దెబ్బతీసింది. ఇక 'తేజ్ ఐ లవ్ యు' చిత్రంలో పాటలు కూడా వావ్ అనే స్థాయిలో లేవు. కానీ కరుణాకరన్ తన పిక్చరైజేషన్‌తో దీనికి జీవం పోశాడని యూనిట్ అంటోంది. ఇక ఈ చిత్రం వేడుకకు మెగాస్టార్ హాజరై బజ్ క్రియేట్ చేశాడు. దానివల్ల ఓపెనింగ్స్‌కి మెగాస్టార్ ఉపయోగపడతాడని అందరు భావించారు. ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేయాలని భావించారు.
కానీ అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం విడుదల మరో వారం వాయిదా పడనుందని, వచ్చే నెల 6వ తేదీన విడుదల కానుందని సమాచారం. ఈమధ్య తెలుగులో పలు చిత్రాలు విడుదల తేదీలను మార్చుకుంటున్నాయి. సెంటిమెంటల్‌గా ఇలా వాయిదాలు పడటం సినిమాలకు చెడునే ఎక్కువగా చేస్తోంది. మరి మెగా మేనల్లుడు ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ని ఎలా అధిగమిస్తాడో వేచిచూడాల్సివుంది...!