ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో సీనియర్ నరేష్, ఆమని జంటగా దాదాపు నాటి తెలుగు సినీ ఇండస్ట్రీలోని కమెడియన్లందరూ నటించిన వినూత్నమైన కాన్సెప్ట్ కలిగిన కామెడీ చిత్రం 'జంబలకిడి పంబ'. ఇందులో ఆడవాళ్లందరు మగవారిలా, మగవారందరూ ఆడవారిలా ప్రవర్తిస్తే వచ్చే వైపరీత్యాలను ఎంతో హాస్యంతో ఈవీవీ తనదైన శైలిలో ఆవిష్కరించారు. మరలా ఇంత కాలం తర్వాత అదే టైటిల్‌తో ఇప్పుడు మరోచిత్రం రూపొందుతోంది. నాటి చిత్రంలో వైజాగ్‌లోని అందరు ఆడవారు మగాళ్లలా, మగాళ్లందరూ ఆడాళ్లలో ఎలా ప్రవర్తిస్తారో ఇందులో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న భార్యా భర్తలైన కమెడియన్ శ్రీనివాసరెడ్డి, సిద్ది ఇద్నానిలు భార్యాభర్తల పోస్ట్‌లను ఎక్చేంజ్ చేసుకున్నట్లుగా అనిపిస్తోంది.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. దీనిలో శ్రీనివాసరెడ్డి అసలు ఈ మగాళ్ల బాడీలో ఉండటం ఎంత నరకమో తెలుసా.. అంటూ ఉంటే హీరోయిన్ సిద్ది ఇద్నానిలు అబ్బాయిలా దుస్తులు వేసుకుని గంభీరంగా కనిపిస్తూ అలరిస్తోంది. రాత్రి ఓ మేటర్ జరిగిందిలే అనే డైలాగును కూడా వదలడం ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉంది. గోపీసుందర్ సంగీతం అందించగా మురళీకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తోందని ఖచ్చితంగా చెప్పవచ్చు. గతంలో పాత క్లాసిక్ టైటిల్స్ అయిన 'భూకైలాస్, ప్రేమనగర్, శంకరాభరణం, గీతాంజలి, మిస్సమ్మ' వంటి పలు చిత్రాలు వచ్చినా వీటిలో విజయం సాధించిన వాటి శాతం తక్కువ.
ఇక కమెడియన్‌గానే కొనసాగుతూ తనకు సూటబుల్ అయ్యే లీడ్ పాత్రలను చేస్తూ 'జయంబు నిశ్చయంబురా, గీతాంజలి, ఆనందోబ్రహ్మ' వంటి చిత్రాల ద్వారా దూసుకెళ్తున్న శ్రీనివాసరెడ్డికి ఈ చిత్రం మంచి ఫలితమే ఇస్తుందని అందరు భావిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న సిద్ది ఇద్నాని మొదటి చిత్రం విడుదల కాకముందే 'ప్రేమకథాచిత్రమ్ 2'లో కీలక పాత్రకు ఎంపిక కావడం వంటివి చూస్తుంటే ఈ కొత్త 'జంబలకిడి పంబ' కూడా పాత చిత్రాన్ని రీప్లేస్ స్థాయిలో ఉంటుందో లేదో వేచిచూడాల్సివుంది...!