బాలీవుడ్ లో సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్స్ తమ చిత్రాలతో నిర్మాతలకు కాసుల పంట పండిస్తున్నారు. తమ తమ చిత్రాలతో కోట్లు కొల్లగొడుతున్నారు. షారుఖ్ కన్నా సల్మాన్, అమీర్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. అమీర్ ఖాన్ దంగల్ సినిమాతో అందరి హీరోలకు భారీ సవాల్ విసిరాడు. దంగల్ చిత్రం కేవలం ఇండియాలోనే కాదు చైనా వంటి దేశాల్లోనూ భారీ కలెక్షన్స్ సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చున్నాడు. కానీ ఇప్పుడు అమీర్ ఖాన్ దంగల్ రికార్డులను ఒక్కొక్కటిగా చెరుపుకుంటూ వచ్చేస్తున్నాడు సల్మాన్ ఖాన్ తన రేస్ 3 తో.
సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 చిత్రం హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తున్న రేస్ లో అనిల్ కపూర్, బాబి డియోల్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ స్పెషల్ గా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సల్మాన్ ఖాన్ కి రంజాన్ అంటే ఎంత స్పెషలో తెలిసిందే. సల్మాన్ సినిమాలన్నీ రంజాన్ కి విడుదలై సూపర్ హిట్స్ సాధించాయి. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ రేస్ చిత్రం అమీర్ దంగల్ ని దాటేసింది. ఏ విషయంలో అంటే.. శాటిలైట్ హక్కుల విషయంలో. రేస్ 3 చిత్రం భారీ రేటుని శాటిలైట్ హక్కుల ద్వారా కొల్లగొట్టింది.
అమీర్ దంగల్ చిత్రానికి జీ ఛానల్ 120 కోట్ల రూపాయలను శాటిలైట్ హక్కుల ద్వారా సమర్పించుకోగా.... దంగల్ శాటిలైట్స్ ద్వారా భారీ మొత్తాన్ని చేజిక్కించుకుని రికార్డులు సృష్టించింది. ఇక దంగల్ తర్వాత మళ్ళీ భారీ రేటుకు అమ్ముడుపోయిన చిత్రంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.ఓ నిలవగా.. ఇప్పుడు ఈ రెండు చిత్రాల శాటిలైట్స్ రికార్డులను సల్మాన్ ఖాన్ రేస్ 3 బ్రేక్ చేసింది. సల్మాన్ ఖాన్ రేస్ 3 కి శాటిలైట్స్ రూపంలోనే పెట్టిన బడ్జెట్ లో మూడొంతులు వచ్చేసిందంటున్నారు. అది కూడా 130 కోట్ల కి రేస్ 3 సాటిలైట్ హక్కులు ద్వారా వచ్చాయంటున్నారు. మరి కండల వీరుడు స్టామినా ఈ శాటిలైట్స్ హక్కుల ద్వారానే అర్ధమవుతుంది. అందుకే కదా సల్మాన్ స్టామినా అంటే ఇది అక్కడా అంటున్నారు ఆయన అభిమానులు.