మెగా ఫ్యామిలీ నుండి గ్రాండ్ గా వెండితెరకు లాంచ్ అవుతాడు అనుకుంటే... చాలా సింపుల్ గా మిడిల్ క్లాస్ అబ్బాయిలా, జాబ్ కోసం తంటాలు పడే కుర్రాడిలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. శ్రీజని పెళ్లి చేసుకుని పెద్ద కుటుంబం, గొప్ప కుటుంబానికి అల్లుడైన కళ్యాణ్ దేవ్ కి సినిమాలంటే ప్రాణం. అందుకే మామ చిరు ఆశీస్సులతో వెండితెరపై తెరంగేట్రం చేస్తున్నాడు. రాకేష్ శశి దర్శకత్వంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా కళ్యాణ్ దేవ్ హీరోగా 'విజేత' సినిమాతో వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో మంచి అంచనాల నడుమ విజేతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కళ్యాణ్ దేవ్ విజేత టీజర్ ని ఈ రోజు మంగళవారం ఉదయం విడుదల చేసింది చిత్ర బృందం.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు, తండ్రి కొడుకుల మధ్య అనుబంధం, అమ్మాయి ప్రేమ కోసం తపన పడే యువకుడిగా కళ్యాణ్ దేవ్ నటన పరంగా పర్వాలేదనిపించారు. కళ్యాణ్ దేవ్ తండ్రిగా మురళీశర్మ నటించాడు. ఈ సినిమా కథ సింపుల్ గా చెప్పాలంటే తండ్రి కొడుకుల మిడిల్ క్లాస్ కథ. ఇద్దరి మధ్యన ఎమోషనల్ గా సాగే డైలాగ్స్ తో విజేత టీజర్ బావుంది. మురళి శర్మ కొడుకునుద్దేశించి లైఫ్ లో కొంచెం కాంప్రమైజై బతకాలి .. తప్పదు. అయినా నువ్వు అలా అవ్వకూడాదనే నీకు నచ్చిన రూట్ సెలెక్ట్ చేసుకుని నువ్వు హ్యాపీగా వుండాలని చిన్నప్పటి నుంచి నీకు ఏది ఇష్టమో అదే ఇస్తూ వచ్చాను .. నా వల్ల అయినంత. ఇంటర్వ్యూస్ కి వెళుతున్నావ్ .. వస్తున్నావ్ .. ఎన్ని రోజులురా ఇలా అనగా... దానికి కళ్యాణ్ దేవ్...చూస్తున్న నాన్నా ఇంకా ఎక్కడా జాబ్ రావడం లేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం ఆకట్టుకునేలా ఉన్నాయి.
మాళవిక నాయర్ ఎప్పటిలాగే పద్దతిగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. కళ్యణ్ దేవ్, మాళవిక శర్మల మధ్య నడిచే ట్రాక్ పర్వాలేదనిపించేలా వుంది. ఇక కళ్యాణ్ దేవ్ మొదటిసారి వెండితెర మీద నటన పరంగా ఓకే అనిపించినా డైలాగ్ డెలివరీ లో మాత్రం స్పష్టత చూపించాడు. మొత్తానికి మామగారు టైటిల్ విజేత తో విజేయుడిగా పదికాలాలు పాటు ఇండస్ట్రీని ఏలాలని ఆశిద్దాం.