నేటిరోజుల్లో సెలబ్రిటీలుగా మారాలని భావించే వారికి షార్ట్‌కట్‌లో సోషల్‌మీడియా కనిపిస్తోంది. నిజమా?కాదా? అనేది పక్క విషయం. పేరున్న వాడి మీద ఓ రాయి వేస్తే కావాల్సినంత పబ్లిసిటీకి కొదువే ఉండదు. ఇక మీడియాలకు కూడా టీఆర్పీలు పెంచుకోవడానికి వీటిని భూతద్దంలో చూపించడం జరుగుతోంది. ఇక శ్రీరెడ్డి గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌ని పీడిస్తున్న పీడగా దాపురించింది. మొదట శేఖర్‌కమ్ముల వంటి వారి మీద పేరు చెప్పకుండా కొన్ని క్లూస్ ఇస్తూ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ ఒకడే కాదని, మరో దర్శకుడు శేఖర్ సూరి కూడా ఉన్నాడని డొంకతిరుగుడుగా మాట్లాడింది. ఆ తర్వాత త్రివిక్రమ్ అర్దం వచ్చేలా ట్వీట్స్, తర్వాత ఉత్తి పుణ్యానికి వర్మ మాట విని పవన్‌ని కూడా ఈ రొచ్చులోకి లాగింది. ఇక ఈమె నాని విషయంలో మాత్రం సూటిగానే ఆరోపణలు చేస్తూ డైరెక్ట్ ఎటాక్ ఇస్తోంది. పాపం.. ఎవరైనా ఎంత కాలం ఓపికపడతారు? ఎంత కాలం సహనం వహిస్తారు? అందుకే నాని తాజాగా శ్రీరెడ్డి విషయంలో స్పందించాడు.
తన పరువుకి సంబంధించి సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ సహనానికి ఓ హద్దు ఉంటుందని ట్వీట్ చేశాడు. చట్టపరంగా ముందుకు వెళ్తున్నాను. పరువు నష్టం కేసు వేస్తూ లీగల్ నోటీసులు ఇచ్చాను. సున్నితంగా కనబడే వారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నాపై వస్తున్న నిరాధార ఆరోపణలు నన్ను కలచివేశాయి. నేను నా గురించి బాధపడటం లేదు. మనం ఉన్న సమాజం గురించి బాధపడుతున్నాను. నాపై వస్తున్న నిరాధార ఆరోపణలను కొందరు క్లిక్‌ల కోసం ప్రచురిస్తున్నారు. వారికి కూడా కుటుంబాలు ఉంటాయి.. కదా అని ఆవేదనగా ప్రశ్నించాడు. ఇక తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డికి నాని లీగల్ నోటీసులు పంపాడు. సామాజిక మాధ్యమాలలో నాపై నిరాధార ఆరోపణలు చేసింది. నా పరువుకి భంగం కలిగిస్తోంది. అని పేర్కొన్న నాని లాయర్ల ద్వారా లీగల్ నోటీసులను శ్రీరెడ్డికి పంపారు.
వారం రోజుల్లోగా సిటీ సివిల్ న్యాయస్థానంలో సమాధానం ఇవ్వాలని న్యాయవాదులు పేర్కొన్నారు. వీటిని చూసే జనాలకు మాత్రం తన తప్పు పెట్టుకుని ఇతరుల మీద బురదజల్లడం, బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారంపై విసుగును వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో ఆమెకి కాస్తైనా సింపతీ వచ్చింది. ఈ పరిణామాలను ఆమె సాగదీయడంతో ఉన్న పరువును కూడా శ్రీరెడ్డి పొగొట్టుకుంటోందని చెప్పాలి.