గత అక్టోబర్‌లో అక్కినేని నాగచైతన్య, సమంతలు గోవాలో ఒకరోజు హిందు వివాహ పద్దతిలో మరోరోజు క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయా పెళ్లి హడావుడి కేవలం సన్నిహితులు, బంధువుల సమక్షంలో జరిగింది. నాడు సమంత, నాగార్జునలు ఈ పెళ్లికి సంబంధించిన పలు ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అలరించారు. కానీ సమంత మాత్రం తమ పెళ్లికి సంబంధించి మాత్రం ఎవ్వరూ వీడియోలు తీయకూడదనే షరతు పెట్టింది.
ఎట్టకేలకు ఇన్ని నెలల తర్వాత సమంత తన పెళ్లి వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పొందుపరిచింది. ఈ వీడియో ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు ప్రామిస్ చేసినట్లుగానే చై-సామ్ పెళ్లిలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని సమంత తెలిపింది. ఇంత బాగా వీడియో తీసిన జోసఫ్, రాధిక్‌లకు ధన్యవాదాలు. దేశంలోనే మీరు బెస్ట్ అని సమంత పొగిడింది.
ఇక ఈ వీడియోలో నాగచైతన్య పెళ్లికొడుకులా తయారవుతూ, అఖిల్‌ని టై ఎక్కడ అని నవ్వూతూ అడగటం ఆకట్టుకుంటోంది. 'వుయ్ కెన్ డూ దిస్.. వుయ్ కెన్ డూ దిస్' అంటూ సమంత పాడుతు, డ్యాన్స్ చేయడం, నాగచైతన్య-సమంతలు కలసి ఉన్న దృశ్యాలు, రానా డ్రమ్స్ వాయించడం, నాగార్జున-సమంతలు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉన్న వీడియో అక్కినేని అభిమానులనే కాదు.. ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆలరిస్తోంది.