Advertisementt

మరో మంచి చిత్ర లక్షణాలు కనిపిస్తున్నాయ్!

Tue 12th Jun 2018 02:25 PM
srinivas kalyanam,actor naresh,shooting pics  మరో మంచి చిత్ర లక్షణాలు కనిపిస్తున్నాయ్!
Actor Naresh Shared Srinivas Kalyanam Shooting Pics మరో మంచి చిత్ర లక్షణాలు కనిపిస్తున్నాయ్!
Advertisement
Ads by CJ

దిల్‌రాజు నిర్మాతగా జడ్జ్‌మెంట్‌ విషయంలో పర్‌ఫెక్ట్‌ అనే చెప్పాలి. కానీ డిస్ట్రిబ్యూటర్‌గా మాత్రం ఆయన అంచనాలు తప్పుతున్నాయి. మరోవైపు డబ్బింగ్‌ చిత్రాలు కూడా ఆయనకు చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. అయినా ఆయన నిర్మించే చిత్రాలు, మరీ ముఖ్యంగా మీడియం రేంజ్‌ హీరోలతో కథకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన చిత్రాలేవీ పెద్దగా నిరాశపరిచిన దాఖలాలు లేవు. ఇక మరోపక్క హీరో నితిన్‌ 'లై'తో పాటు 'ఛల్‌ మోహన్ రంగ' చిత్రంతో కూడా డీలాపడ్డాడు. ఇలాంటి సమయంలో నిర్మాత రాజుని దిల్‌రాజుగా మార్చిన చిత్రం 'దిల్‌' తర్వాత ఇంత గ్యాప్‌ తీసుకుని నితిన్‌తో దిల్‌రాజు 'శ్రీనివాసకళ్యాణం' అనే చిత్రం నిర్మిస్తున్నాడు. 'శతమానం భవతి' వంటి అవార్డులు, రివార్డులు పొందిన చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్‌వేగ్నేష్‌ దీనికి దర్శకుడు కావడం విశేషం. 

మరోవైపు 'తొలిప్రేమ' చిత్రంలో తన అందం, టాలెంట్‌ పరంగా కూడా సక్సెస్‌ అయిన రాశిఖన్నా ఇందులో నితిన్‌కి జోడీగా నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా నందిత శ్వేత నటిస్తోంది. ఉత్తరాదిలో కొంత కీలక షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని ఓ కీలకమైన పాటను హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. దీంతో షూటింగ్‌ పార్ట్‌ దాదాపుగా పూర్తయినట్లేనని తెలుస్తోంది. ఓ పండగ నేపధ్యంలో వచ్చే ఆర్టిస్టులందరూ పాడుకునే పాటగా దీనిని చిత్రీకరిస్తుంటే షూటింగ్‌ గ్యాప్‌లో ఇందులో నటిస్తున్న ప్రకాష్‌రాజ్‌, జయసుధ, నరేష్‌, గిరిబాబు, రాజేంద్రప్రసాద్‌ వంటి వారు తీసుకున్న ఫోటోలను చూస్తే ఈ చిత్రం బంధాలు, అనుబంధాలను తెలిపే మరో కుటుంబ కథా చిత్రంగా అనిపిస్తోంది. 

ఇక ఈ చిత్రాన్ని ఆగష్టు 9న విడుదల చేయాలని భావిస్తున్నారు. గతంలో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్‌, భానుప్రియ, గౌతమి జంటగా ఇదే టైటిల్‌తో వచ్చిన చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి ఈనెలాఖరుతో షూటింగ్‌ పూర్తి చేసుకోనున్న ఈ 'శ్రీనివాసకళ్యాణం' మీద నితిన్‌తోపాటు దిల్‌రాజు కూడా భారీ ఆశలే పెట్టుకుని ఉన్నాడు. 

Actor Naresh Shared Srinivas Kalyanam Shooting Pics:

Srinivas Kalyanam Shooting in Full Swing

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ