టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి పెద్దగా పేరుండదనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఎక్కడో ఒకటి అరా హీరోయిన్స్ మాత్రమే హీరోయిన్స్ గా నిలదొక్కుకుని చక్రం తిప్పారు కానీ.... తెలుగమ్మాయిలకు అందం తక్కువో, అభినయం రాదనో ఎందుకో తెలియదు గాని దర్శక నిర్మాతలెప్పుడు పరభాషా హీరోయిన్స్ మీదే మోజుపడతారు. అంతేలే తెలుగు హీరోయిన్స్ ని పెట్టి సినిమాలు చేస్తే తెలుగు ప్రేక్షకులు కనికరించరనేది వారి వాదన. ఇకపోతే తెలుగమ్మాయిగా 'అమీతుమీ, అ' వంటి సినిమాల్లో నటించిన ఈషా రెబ్బాకి టాలీవుడ్ లో ఇప్పటివరకు బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాలు హిట్ అయినా అమ్మడుకి మాత్రం పేరు రాలేదు.
ప్రస్తుతం త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత - వీర రాఘవ' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. 'అరవింద సమేత'లో పూజా హెగ్డే మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇకపోతే 'అరవింద సమేత' షూటింగ్ లో పాల్గొన్న ఈషా రెబ్బా ఆ సినిమా ముచ్చట్లను కథలు కథలుగా చెబుతున్నది. 'అరవింద సమేత'లో తనకు ఒక డిఫరెంట్ రోల్ దొరికిందని.... ఇలాంటి పాత్రలు చెయ్యడం తనకి ఛాలెంజ్ అని చెబుతుంది. అలాగే ఈ పాత్రకి తనని ఎంపిక చేసినందుకు గాను త్రివిక్రమ్ కి థాంక్స్ చెప్పడమే కాదండోయ్... పనిలో పనిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెగ పొగిడేస్తోంది.
'అరవింద సమేత' సెట్స్‌లో ఎన్టీఆర్‌తో కలిసి పని చేయడం ఎగ్జయింటింగ్‌గా ఉందని..... ఎన్టీఆర్ ని అతని ఎనర్జీని ‘విద్యుత్ ప్రవహించే ఓ లైవ్ వైర్' అంటూ ఆకాశానికెత్తేస్తుంది ఈ అమ్మడు. ఎన్టీఆర్ ఎనర్జీతో సమానంగా పని చెయ్యడం అనేది మాటలు కాదని ఎన్టీఆర్ ని పొగడడమే కాదు... ఎన్టీఆర్ 'అరవింద సమేత' సెట్స్ లో అందరితో ఫన్నీగా ఉంటారని చెబుతుంది. అలాగే చిత్ర యూనిట్ మొత్తం సరదాగా జోకులు వేసుకుంటూ హాయిగా పనిచేస్తుంటామని కూడా చెబుతుంది ఈషా రెబ్బా.