బాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్ధాలు నుండి తన గ్లామర్ తో పెద్ద హీరోస్ పక్కన చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతుంది హాట్ బ్యూటీ కత్రినా కైఫ్. తెలుగులో వెంకటేష్ తో 'మల్లీశ్వరి' సినిమాలో టైటిల్ రోల్ చేసిన కత్రినా కైఫ్ అటునుండి అటు బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోస్ తో చేసి తన కెరీర్‌ని మలుచుకుంది.
ఆ తర్వాత రణవీర్‌తో ఎఫైర్, బ్రేకప్.. అటుపై తిరిగి సల్మాన్ గూటికి చేరిన వ్యవహారం తెలిసిందే. అప్పటినుండి తన కెరీర్ కు డోకా లేదుగా అన్నట్టుగా మార్చుకుంది కైఫ్. కత్రినా ఏ సినిమా చేసినా ఆ సినిమాకు తనే పెద్ద అస్సెట్ అవుతోంది. 'ధూమ్ 3' లో తన సర్కస్ ఫీట్స్‌తో మతిచెడగొట్టింది. ఇక లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ సరసన 'టైగర్ జిందా హై' మూవీలో అదిరిపోయే ఫైట్స్ తో అదరగొట్టేసింది.
ఇది ఇలా ఉంటే... కత్రినా కైఫ్ పారితోషికం ఎంత అని ఆరా తీస్తే...షాకింగ్ ఆన్సర్ వచ్చింది. ప్రతి సినిమాకు ఏకంగా 12కోట్ల పారితోషికం అందుకుంటోంది. అవును నిజమే అక్షరాలా 12కోట్ల తీసుకుంటుంది కైఫ్. ప్రస్తుతం ఈ అమ్మడు ఖాతాలో షారూక్ ఖాన్ 'జీరో' తో పాటు.. సల్మాన్ సరసన 'దబాంగ్ 3' చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మన స్టార్ హీరోస్ అంత తీసుకుంటారు. అయితే అదే లైన్ లో జాక్వలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హా వంటి తారలు మినిమంగా 6-8 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు సమాచారం.