Advertisementt

సమంత కిడ్నాప్‌ చేస్తుందట..!

Mon 11th Jun 2018 02:21 PM
samantha,kidnap,twitter,netizen,rangamma mangamma song  సమంత కిడ్నాప్‌ చేస్తుందట..!
Samantha wants to kidnap this kid సమంత కిడ్నాప్‌ చేస్తుందట..!
Advertisement
Ads by CJ

ఈ వేసవికి వచ్చిన సుకుమార్‌-రామ్‌చరణ్‌-సమంతలు నటించిన 'రంగస్థలం' చిత్రం అద్భుతమైన కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రం మ్యూజికల్‌గా కూడా ఇరగదీసింది. ప్రతి పాటా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ప్రముఖ పాత్ర వహించాడు. అందలోనూ ఈ చిత్రంలోని 'రంగమ్మ.. మంగమ్మ' పాట అయితే ఓ ఊపు ఊపేసింది. ఈపాట ఇప్పటివరకు యూట్యూబ్‌లో దాదాపు 50మిలియన్‌ వ్యూస్‌ని సాధించింది. 

ఇటీవల ఈ పాటను ఓ తాతయ్య పాడుతూ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టగా అది విపరీతంగా వైరల్‌ అయింది. తాజాగా ఓ ఎలిమెంటరీ స్కూల్‌ బుడతడు తన స్టెప్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌, డ్యాన్స్‌లో ఈజ్‌తో ఈ పాటకు డ్యాన్స్‌చేసి వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో సమంత వరకు వెళ్లింది. దాంతో వెంటన ఆమె ఈ వీడియోను రీట్వీట్‌ చేసింది. ఈ పాట ఎంతో పాపులర్‌ అయింది. మరి దీనిని పదే పదే చూడకుండా ఉండగలవా? సమంత అంటూ ట్వీట్‌ చేశాడు. 

దానికి సమంత రిప్లై ఇస్తూ, వీడియోను రీట్వీట్‌ చేసి, పిల్లాడు చేసిన డ్యాన్స్‌కి ఎంతో ఆనందం కలిగిందని తెలిపింది. 'ఓకే నేను ఈ చిన్నోడిని కిడ్నాప్‌ చేస్తా' అంటూ సరదాగా ట్వీట్‌ చేసింది. ఇంతకు ముందు ఈ పాట పాడిన తాతయ్య వీడియోలాగే, ఈ బుడతడి వీడియో కూడా సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. మొత్తానికి ఈచిత్రం విడుదలై శతదినోత్సవానికి పరుగులు తీస్తున్నా కూడా ఈ పాటపై ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని అర్ధమవుతోంది. 

Samantha wants to kidnap this kid:

'Okay I am kidnapping this cutie … ': Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ