Advertisementt

మహేష్ ఆ లుక్ లో ఉండేది అరగంటే!

Mon 11th Jun 2018 01:03 AM
mahesh babu,vamsi paidipally,latest updates,beard and moustache show,30 minutes  మహేష్ ఆ లుక్ లో ఉండేది అరగంటే!
Interesting Gossips on Mahesh and Vamsi Paidipally Movie మహేష్ ఆ లుక్ లో ఉండేది అరగంటే!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మహేష్ - వంశీ సినిమా పట్టాలెప్పుడెక్కుతుందో క్లారిటీ లేదు. ఎందుకంటే పివిపి నుండి సమస్యలెదుర్కుంటున్న మహేష్ 25 వ మూవీని ఎలాగైనా సెట్స్ మీదకి తీసుకెళ్లాలని.. ఈ సినిమా నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ లు శతవిధాలా ప్రయత్నిస్తుంటే.. మరోపక్క మహేష్ బాబు రఫ్ లుక్ లో ఎయిర్ పోర్ట్ లో కనబడేసరికి అదే మహేష్ 25 వ సినిమా న్యూ లుక్ అంటూ దాదాపుగా అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ మహేష్ మేకోవర్ ఇంకా పూర్తి కాలేదని.. ఇంకా లుక్ మార్చాల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుతం అన్నిపనులు పక్కన పెట్టి తన లుక్ మీదే మహేష్ కాన్సంట్రేషన్ చేస్తున్నాడట.

అయితే మహేష్ బాబు న్యూ లుక్ ఎలా ఉంటుంది... అసలు సినిమాలో ఎలా వుండబోతుందో అనే క్యూరియాసిటిలో మహేష్ అభిమానులు ఉండగా... మహేష్ న్యూ లుక్ అంటే గెడ్డం లుక్ ఈ సినిమా లో కేవలం 30 నిముషాలు మాత్రమే ఉంటుందని కూడా టాక్ వినబడుతుంది. ఆ గెడ్డం లుక్ లో మహేష్ బాబు కాలేజీ స్టూడెంట్ గెటప్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఎంబిఎ స్టూడెంట్ గా ఓ అరగంట మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లో మహేష్ బాబు గెడ్డం అంటే న్యూ లుక్  తాలూకు సన్నివేశాలు ఉంటాయట. ఇక మహేష్ ధనవంతుడిగా కనబడతాడనే ప్రచారం కూడా ఉంది.

ఇక మరో కామెడీ హీరో అయిన అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహేష్, అల్లరి నరేష్ లిద్దరు మంచి ఫ్రెండ్స్ అని.. ఒకరు గొప్పవాడిగాను, మరొకరు పేదవానిగా కనబడతారనే ప్రచారం ఉంది. అయితే కృష్ణుడు ఎవరు, కుచేలుడు ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి.. మహేష్ తో కలిసి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేందుకు రెడీగా వున్నాడు. ఈ నెల 17 నుండి వంశీ - మహేష్ ల న్యూ మూవీ రెగ్యులర్ షూటింగ్ డెహ్రాడూన్ లో మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

Interesting Gossips on Mahesh and Vamsi Paidipally Movie:

Mahesh Babu and Vamsi Paidipally Movie Latest Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ