సమ్మర్ అంటే సినిమాల హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సమ్మర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి రిలీజ్ కావడంలేదు. అందుకు కారణం ప్లానింగ్ లో లోపాలే అని తెలుస్తుంది. లేకపోతే ఈ పాటికే 'టాక్సీవాలా', 'సాక్ష్యం', 'సవ్యసాచి', 'పంతం' రిలీజ్ అయిపోయేవి. సాయిధరమ్ తేజ్.. 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా కూడా ఈ బాపతే కానీ కొంచం ముందు అంటే జూన్ 29న వస్తున్నాడు. ఇక మిగతా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఇంకా క్లారిటీ లేదు.
విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమా వచ్చి ఏడాది పైనే అవుతుంది కానీ ఇంతవరకు ఆయన నుండి ఫుల్ లెంగ్త్ మూవీ ఒక్కటి కూడా రాలేదు. కొత్త దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్ లో 'టాక్సీవాలా' చేస్తున్నాడు. ఈ సినిమా టేకింగ్ అంత బాగానే ఉన్నా కొంత భాగం రీషూట్ చేస్తున్నారనే టాక్ వస్తుంది. గీతా, యువి వంటి పెద్ద బ్యానర్ల నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఒకటికి రెండు సార్లు అవుట్ ఫుట్ ను చూసుకుని నిర్ణయం తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత శ్రీవాస్ డైరెక్షన్ లో 'సాక్ష్యం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర బాగా ఆలస్యం అవుతోంది. లేకుంటే మే 18నే థియేటర్లోకి రావాల్సింది. హెవీ గ్రాఫిక్స్ ఉన్నందున సినిమా లేట్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. మేకర్స్ మాత్రం వచ్చే నెల 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయినా వచ్చే వరకు చెప్పలేం. గ్రాఫిక్స్ వల్ల ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక గోపీచంద్ న్యూ మూవీ 'పంతం' కూడా అదే పరిస్థితి. జులై లోను.. లేదా ఈనెల చివరిలోనో అన్న క్లారిటీ లేదు పంతం మేకర్స్ కి. ఈ సినిమాలు అన్ని ఈ సమ్మర్ హాలీడేస్ ని మిస్సయ్యి మంచి సీజన్ ని పోగొట్టుకున్నాయి.