Advertisementt

అలియా భట్ రూటే సెపరేటు..!!

Sun 10th Jun 2018 12:19 PM
alia bhatt,marriage,ranbir kapoor,brahmastra movie  అలియా భట్ రూటే సెపరేటు..!!
Alia Bhatt About Marriage అలియా భట్ రూటే సెపరేటు..!!
Advertisement
Ads by CJ

మన దేశ రాష్ట్రపతి కూడా తెలియని నటి అలియాభట్‌. ఈమెకి జనరల్‌ నాలెడ్జ్‌లో ఎంతో పూర్‌ మార్కులు ఉన్నా కూడా నటిగా మాత్రం చిన్నవయసులోనే ఈమె సంచలనాలు నమోదు చేస్తోంది. నటన, గ్లామర్‌ వంటి రెండింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ బాలీవుడ్‌లో తిరుగేలేని విధంగా తీసుకెళ్తోంది. ముఖ్యంగా ఆమె నటనలో చూపించే పెర్‌ఫార్మెన్స్‌ చూస్తే ఆమెని విమర్శించే వారు కూడా ప్రశంసించక మానరు. 

ఇక విషయానికి వస్తే మన హీరోయిన్లను రెండు విషయాలు అడిగితే వాటిని దాటవేస్తారు.. మరికొందరైతే ఆ ప్రశ్నలు అడిగిన వారిపై మండిపడతారు. కానీ అందరిలా ఉంటే ఆమె అలాయాభట్‌ ఎలా స్పెషల్‌ అవుతుంది? దాంతో తాజాగా ఆమె తనని కొత్త జీవితం ఎప్పుడు ఆరంభిస్తారు? ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అని మీడియా ప్రశ్నించింది. దానికి అలియా సమాధానం చెబుతూ, 30ఏళ్లలోనే పెళ్లి చేసుకుని జీవితంలో స్ధిరపడాలనేది నా కోరిక. ఆ మధుర క్షణాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. ఆ సమయం కోసం ఎదురు చూడక తప్పదు... అని అదిరిపోయే సమాధానం చెప్పింది. 

ఇక ప్రస్తుతం అలియాభట్‌ నటించిన 'రాజీ' చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం 100కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ఇక ప్రస్తుతం ఆమె ప్రస్తుతం రణ్‌బీర్‌కపూర్‌ సరనన 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో నటిస్తోంది. 

Alia Bhatt About Marriage:

I'm not Thinking About Marriage or Planning as of now: Alia Bhatt 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ