రజినీకాంత్ తాజా చిత్రం కాలా జూన్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చి... యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాలా సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. అసలు రజినీకాంత్ కున్న స్టామినా కూడా కాలా ఓపెనింగ్ కలెక్షన్స్ పెంచలేకపోయాయి. రజినీకాంత్ సినిమాలకు హిట్స్ ప్లాప్స్ తో పనిలేకుండా ఓపెనింగ్స్ కొల్లగొట్టేస్తాయి. అలాంటిది కాలా కి మాత్రం ఓపెనింగ్స్ దారుణంగా పడిపోయాయి. అయితే కాలా సినిమా పోస్ట్ పోన్ అవడము, ప్రీ పోన్ అవడము, అలాగే రంజిత్ పా ట్రాక్ రికార్డ్ కూడా బాగోక పోవడం వలన కాలా మీద ప్రేక్షకుల్లో ఇంట్రస్ట్ లేదు.
అయితే ఇప్పుడు కాలా కొచ్చిన కష్టమే 2.ఓ కి కూడా రాబోతోందా అనే టాక్ మొదలైంది. దర్శకుడు శంకర్ రోబో 2.ఓ సినిమాని మొదలు పెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. భారీ బడ్జెట్ తో భారీగా లైకా ప్రొడక్షన్ వారు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కించిన 2.ఓ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకునే ఏడాది కావొస్తుంది. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ లోని లోపాల వలన సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి తగ్గేలా చేస్తుంది. గత ఏడాది 2.ఓ ఆడియో వేడుక... అలాగే అప్పుడప్పుడు సినిమా స్టిల్స్ కొన్ని బయటికొచ్చి సందడి చేసినా.. ఈ ఏడాది మాత్రం 2.ఓ సినిమా సమాచారం ఎక్కడా బయటికి రావడం లేదు.
మరి ఇలా చడీ చప్పుడు లేకుండా ఉంటే మరి 2.ఓ పరిస్థితి కూడా కాలా లాగే ఉంటుందని ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి. శంకర్ డైరెక్షన్ లో భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన 2.ఓ సినిమా ఎలా ఉండబోతుందో.... అనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుల్లో మెల్లగా సన్నగిల్లుతుంది అనేది మాత్రం వాస్తవం అంటున్నారు కొందరు.