Advertisementt

అఖిల్ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు!

Fri 08th Jun 2018 07:21 PM
akhil akkineni,craze,200 big c store,remuneration  అఖిల్ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు!
Akhil Got Good Remuneration at Shop Openings అఖిల్ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ 'మనం' సినిమాతో కామియో రోల్ చేసి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వినాయక్ డైరెక్షన్ లో 'అఖిల్' అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో 'హలో' సినిమా చేశాడు. అది కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఈ  రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా యూత్ లో మాత్రం అఖిల్ క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. తన బ్రాండ్ వ్యాల్యూ కూడా పెరగడంతో ఏమైనా ఓపెనింగ్స్ కి వెళ్తే లక్షల్లో డబ్బులు వసూల్ చేస్తున్నాడంట. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా అఖిల్ హైదరాబాద్ లో  ఓ జిమ్ ఓపెనింగ్ కు హాజరయ్యాడు. ఆ కార్యక్రమానికి హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా హాజరైంది.

ఈ ఓపెనింగ్ ఫంక్షన్ కి అఖిల్ కనీసం 20 నిముషాలు కూడా లేడు. ఆ ఫంక్షన్ కు హాజరైనందుకు అఖిల్ రూ. 8 లక్షల వరకు వసూలు చేశాడట. అతను హీరో అవ్వకముందు కొన్ని యాడ్స్ చేశాడు. మౌంటైన్ డ్యూ, టైటాన్ వాచ్ లకు అఖిల్ బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. ఇక నిన్న కొత్తగా బిగ్ సీ 200 వ స్టోర్ ను హైదరాబాద్ లో లాంచ్ చేశాడు. ప్రస్తుతం అఖిల్.. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లవ్ స్టోరీ జోనర్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

Akhil Got Good Remuneration at Shop Openings:

Akhil Akkineni Craze Continues

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ