హెచ్ బి డి - హ్యక్‌డ్ బై డెవిల్ అనే సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ లాగిన్ మీడియా ప్రస్తుతం మరో రెండు సినిమాలను రూపొందిస్తుంది. ప్రస్తుతం స్నేహం, స్నేహితులు అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో.. ఇప్పుడు జరుగుతున్న గేమ్ షోలకు భిన్నంగా.. ప్లాన్ చేసిన గేమ్ షో 'ఓ మై ఫ్రెండ్' తో సందడి చేయడానికి సిద్ధమైంది. చలాకీ చంటి, విష్ణుప్రియ ఈ షోకు యాంకర్స్‌గా వ్యవహరించనున్నారు. రమేష్ దర్శకత్వంలో వి.పాండు రంగారావు, ఉదయ్ భాస్కర్ గౌడ్ నిర్మాతలుగా షో రూపొందుతోంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
ఉదయ్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ.. 'మా లాగిన్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలో ఆల్ రెడీ ఉంది. ఇప్పుడు టీవీల్లోకి కూడా అడుగుపెట్టాలనే ఆలోచన వచ్చింది. అందుకని ఓ గేమ్ షో ప్లాన్ చేశాం. 'ఓ మై ఫ్రెండ్' అనేది గేమ్ షో టైటిల్. ఈ గేమ్ షోకి వడ్డేపల్లి పాండు రంగారావుగారు నిర్మాతల్లో ఒకరు. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
చలాకీ చంటి మాట్లాడుతూ.. 'లాగిన్ మీడియా సంస్థ చేస్తున్న ఈ గేమ్‌షోకి నేను, విష్ణుప్రియ యాంకర్స్‌గా వ్యవహరిస్తున్నాం. వీలైనంత ఎంటర్‌టైనింగ్‌గా గేమ్‌షో ఉండాలని ప్లాన్ చేస్తున్నాను. ఓ మంచి స్నేహితుడు ఎలా ఉంటాడు? ఇద్దరు స్నేహితులు ఎలా అయ్యారు? స్నేహం ఎందుకు బలపడింది? అనే విషయాలను చెబుతూ ఓ గేమ్ షోను ప్లాన్ చేశాం. లాగిన్ సంస్థ ప్రయత్నాలను సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను' అన్నారు.
విష్ణుప్రియ మాట్లాడుతూ.. 'చంటిగారితో కలిసి ఓ గేమ్ షో చేస్తుండటం ఆనందంగా ఉంది. లాగిన్ సంస్థ స్నేహం అంశంపై గేమ్ షో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ గేమ్ షో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని భావిస్తున్నాను' అన్నారు.
డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ.. 'ఈ షో టెలికాస్ట్ అయిన రోజు నుండి అందరినీ మెప్పిస్తుంది' అన్నారు.
వి.పాండు రంగారావు మాట్లాడుతూ.. 'మంచి కాన్సెప్ట్ ఉన్న గేమ్ షో 'ఓ మై ఫ్రెండ్'. ప్రేక్షకులు ఈ షోను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.
ఈ కార్యక్రమంలో కెమెరామెన్ మోహన్‌చంద్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.