Advertisementt

ఎన్టీఆర్ కి గిఫ్ట్ అన్నగా ఇచ్చాడా? లేక..?

Thu 07th Jun 2018 12:56 PM
jr ntr,kalyan ram,jai lava kusa,birthday gift  ఎన్టీఆర్ కి గిఫ్ట్ అన్నగా ఇచ్చాడా? లేక..?
Kalyan Ram surprises NTR ఎన్టీఆర్ కి గిఫ్ట్ అన్నగా ఇచ్చాడా? లేక..?
Advertisement
Ads by CJ

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం చేస్తున్నాడు. దీని ముందు ఆయన తన అన్నయ్య కళ్యాణ్‌రామ్‌ బేనర్‌లో తన అన్నయ్యే నిర్మాతగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌బేనర్‌లో 'జైలవకుశ'లో నటించాడు. విమర్శకులను మెప్పించలేకపోయినా కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లనే వసూలు చేసి నందమూరి కళ్యాణ్‌రామ్‌కి నిర్మాతగా కూడా మంచిలాభాలు తెచ్చిపెట్టింది. దానికి ముందు కూడా తన అన్నయ్య నందమూరి కల్యాణ్‌రామ్‌ రవితేజ, సురేందర్‌రెడ్డిలతో తీసిన 'కిక్‌2' కూడా డిజాస్టర్‌కావడం, విడుదలకు కూడా ఇబ్బందులు ఉండటంతో ఎన్టీఆర్‌ తన అన్నయ్యకి ఆ చిత్రం విడుదలయ్యేందుకు ఆర్ధికసాయం అందించాడు. 

ఇక విషయానికి వస్తే మే20వ తేదీన జూనియర్‌ ఎన్టీఆర్‌ తన బర్త్‌డే జరుపుకున్నాడు. ఎన్టీఆర్‌కి బ్రాండెడ్‌ రిస్ట్‌వాచ్‌లంటే చాలా ఇష్టం. ఆయన అందుకే చాలా రకాల రిస్ట్‌వాచ్‌లను ధరిస్తూ ఉంటాడు. దీంతో యంగ్‌టైగర్‌ బర్త్‌డే సందర్భంగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ యూరప్‌ నుంచి ఓ విలువైన రిస్ట్‌ వాచీని తెప్పించి ఎన్టీఆర్‌కి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చాడట. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన అన్నయ్య ఇచ్చిన బహుమతిని ఎన్టీఆర్‌ ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడట. 

ఇక నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన 'జైలవకుశ' చిత్రం కోసం ఎన్టీఆర్‌ ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకున్నాడు అనేది తెలియడం లేదు. ఇక కళ్యాణ్‌రామ్‌ తన తమ్ముడి బర్త్‌డేకి ఓ అన్నయగా ఈ రిస్ట్‌వాచ్‌ని బహూకరించాడా? లేక 'జైలవకుశ' తో భారీ లాభాలు వచ్చినందుకు ఓ నిర్మాతగా ఎన్టీఆర్‌కి ఈ వాచ్‌ని బహూకరించాడా? అనేది తేలాల్సివుంది..! 

Kalyan Ram surprises NTR:

>NTR Gets Best Birthday Gift from Kalyan Ram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ