సంక్రాంతి అంటే మనకి పండగ మాత్రమే కాదు ఆ మూడు రోజుల్లో వరసబెట్టి సినిమాలు రిలీజ్ అవ్వుతుంటాయి. అయితే బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. తన సినిమా ఏ పరిస్థితిల్లో ఉన్న సంక్రాంతి రేస్ లో బాలయ్య సినిమా ఉండాల్సిందే. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'పై తన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' విడుదల చేశాడు బాలయ్య.
'ఖైదీ నంబర్ 150' చిత్రం 100 కోట్లు పైన కలెక్షన్స్ ని వసూల్ చేస్తే.. బాలయ్య 'గౌతమిపుత్ర శాతకర్ణి' 50 కోట్లు పైన వసూల్ చేసింది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'పై బాలయ్య 'జై సింహా' చిత్రంను రిలీజ్ చేశాడు. ఇందులో పవన్ సినిమా డిజాస్టర్ కాగా.. బాలకృష్ణ సినిమా కమర్షియల్‌గా పాస్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మెగా ఫ్యామిలీతో సై అంటున్నాడు బాలయ్య.
వచ్చే సంక్రాంతికి బాలయ్య.. ఎన్టీఆర్ బయోపిక్ ను ఎట్టి పరిస్థితిల్లో తీసుకుని రావడానికి ట్రై చేస్తున్నాడు. అదే టైంకి రామ్ చరణ్ - బోయపాటి సినిమా కూడా డేట్ ఫిక్స్ చేసారు. ఇలా ప్రతి సంక్రాంతికి బాలయ్య .. మెగా ఫ్యామిలీ సినిమాలపై సై అంటూ వుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఏదిఏమైనా ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్. కంటెంట్ బాగుంటే ఈ రెండు సినిమాలు హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.