ప్రస్తుతం టాలీవుడ్ లో గెడ్డం లుక్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే రామ్ చరణ్ రంగస్థలం సినిమా కోసం ఒక ఏడాది పాటు గెడ్డం పెంచి.. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు గా అదరగొట్టేశాడు. ఇక ఎన్టీఆర్ కూడా అరవింద సమేత కోసం కొంచెం గెడ్డం పెంచి సిక్స్ ప్యాక్ లుక్ లోకొచ్చేశాడు. ఇక ఇప్పుడు మహేష్ వంతు వచ్చేసింది. మహేష్ బాబు ఎప్పుడూ పెద్దగా సినిమాల్లో గెడ్డంతో కనిపించిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. పోకిరి సినిమాలో రఫ్ గా కనబడినా.. అందులో మహేష్ చాలా అందంగా ఉన్నాడు. కానీ ఆతర్వాత రఫ్ లుక్ లో వచ్చిన సినిమాలేవీ ఆడలేదు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు, వంశి పైడిపల్లి సినిమా కోసం మాస్ లుక్ లోకి మారబోతున్నాడు అనే న్యూస్ గత నెల రోజుల నుండి వినబడుతుంది.
మహేష్ బాబు తన 25 వ సినిమా కోసం ప్రత్యేకంగా గెడ్డం లుక్ లోకి అంటే న్యూ లుక్ లోకి మారబోతున్నాడంటూ ఒకటే న్యూస్ లు వెలువడుతున్నాయి. నిజంగానే ఇప్పుడు మహేష్ బాబు, వంశి సినిమా కోసం గెడ్డం లుక్ లోకి మారిపోయాడు. మొన్నటి వరకు విదేశాల్లో ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేసిన మహేష్ తన న్యూ లుక్ కోసం మేకోవర్ అయ్యాడు. ఇప్పుడు మహేష్ బాబు తన న్యూ గెడ్డం లుక్ తో ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. మహేష్ గెడ్డం లుక్ తో కాస్త స్టైలిష్ గా కనిపించాడు. మరి తన న్యూ మూవీ కోసం మహేష్ టోటల్ గా తన లుక్ మార్చేశాడు. ఇక మహేష్ బాబు తన 25 వ సినిమా సెట్స్ మీదకెళ్లడమే తరువాయి. ఇక మరో వారం రోజుల్లోనే వంశి పైడిపల్లితో మహేష్ సినిమా పట్టాలెక్కనుంది.
ఇక మహేష్ తో మొదటిసారి జోడి కడుతుంది ప్రస్తుతం టాప్ లోకొచ్చేసిన పూజా హెగ్డే. ఇక ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా.. ఈ సినిమాకి 'రాజసం' అనే టైటిల్ ప్రచారంలోకొచ్చింది. ఇకపోతే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు, అశ్వినీదత్ లు నిర్మిస్తున్నారు.