తమ ప్రతిభా పాటవాలతో, తమ వృత్తిలో నాడు లెజెండ్స్‌గా కీర్తించబడిన మహామహులైన సినీ ప్రముఖులందరు ఒకే చోట ఉన్న అరుదైన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను దగ్గుబాటి రానా తన స్నేహితుడు, నటుడైన అడవిశేషుకి షేర్ చేశాడు. ఈ విషయాన్ని అడవిశేషు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియ జెప్పాడు. సోషల్‌మీడియా ద్వారా ఈ ఫొటోను విడుదల చేస్తూ అడవి శేషు దగ్గుబాటి రానాకి ఈ ఫొటోను తనకు షేర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలపాడు.
ఇక ఈ ఫొటోలో ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి, ఎస్వీఆర్, శివాజీగణేషన్, జెమినిగణేషన్, జయలలిత, విజయలలిత, బాలకృష్ణ (అంజి), కాంచన, బియన్‌రెడ్డి, నంబియార్, పేకేటి శివరాం వంటివారు చాలా మంది ఉన్నారు. ఎంత మంచి ఫోటోను షేర్ చేశారంటూ అడవిశేషుని, రానా దగ్గుబాటిని పలువురు ప్రశంసలల్లో ముంచెత్తుతున్నారు. 'అందరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో ఇది పాత ఫొటోనే అయినా బంగారంతో సమానం. వావ్.. సూపర్ ఫొటో అంటూ ప్రశంసలతో కూడిన కామెంట్స్ వస్తున్నాయి.
అయితే ఈ ఫొటోని ఏ సందర్భంలో దిగారో మాత్రం తెలియరావడం లేదు. మరి ఇలాంటి అరుదైన ఫొటోలు వంటి వాటి కోసం తెలుగు చలన చిత్రపరిశ్రమ ఓ ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసి, ఎవరెవరి వద్దనో ఉన్న ఫొటోలన్నిటినీ ఒక చోటికి చేర్చి రాబోయే తరాలకు అందజేయాల్సివుంది...!