Advertisementt

నాని.. నేనెవ్వరినీ ఫాలో కానంటున్నాడు..!

Wed 06th Jun 2018 03:44 PM
hero nani,bigg boss season 2,jr ntr  నాని.. నేనెవ్వరినీ ఫాలో కానంటున్నాడు..!
Nani About Bigg Boss Season 2 నాని.. నేనెవ్వరినీ ఫాలో కానంటున్నాడు..!
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్‌ సీజన్‌1ని ఎన్టీఆర్‌ దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఈ షో సక్సెస్‌ కావడంలో మేజర్‌ షేర్‌ ఎన్టీఆర్‌కి చెందుతుంది. కానీ బిగ్‌బాస్‌ సీజన్‌2కి వచ్చే సరికి ఎన్టీఆర్‌ బిజీ వల్ల నో చెప్పడంతో నానిని హోస్ట్‌గా తీసుకున్నారు. నాని కూడా ఇటీవల వరుస విజయాల నుంచి 'కృష్ణార్జునయుద్దం' చిత్రంతో ఫ్లాప్‌ని అందుకున్నాడు. ప్రస్తుతం నాగార్జునతో ఓ మల్టీస్టారర్‌ చేస్తున్నాడు. కానీ ఎప్పుడు చేతిలో మూడు నాలుగు ప్రాజెక్ట్స్‌ ఉంచుకునే నాని విక్రమ్‌ కె.కుమార్‌, తర్వాత కొరటాల శివ వంటి వారి ప్రాజెక్ట్స్‌ ఆగిపోవడంతో మొదట బిగ్‌బాస్‌2ని హిట్‌ చేసే పనిలో ఉన్నాడు. అయితే నాని ముందున్నది మాత్రం ముసళ్ల పండగేనని చెప్పాలి. ఎందుకంటే 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి'ని బిగ్‌బి అమితాబ్‌ సూపర్‌హిట్‌ చేస్తే షారుఖ్‌ రాణించలేకపోయాడు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను నాగ్‌ హిట్‌ చేస్తే చిరు ఫట్‌ అయ్యాడు. మరి బిగ్‌బాస్‌ విషయంలో ఎన్టీఆర్‌ సక్సెస్‌ అయ్యాడు. మరి నాని ఏమి చేస్తాడో చూడాల్సివుంది. 

తాజాగా నానిని ఓ విలేకరి మీరు ఎన్టీఆర్‌ని ఫాలో అవుతారా? లేక సల్మాన్‌ఖాన్‌ని ఫాలో అవుతారా? అని ప్రశ్నిస్తే, నేను ఎవ్వరినీ ఫాలో కాను, నా స్టైల్‌లో నేను చేసుకుంటూ వెళతాను. నేను నాలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అదే ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నా నమ్మకం అన్నాడు. అల్లుఅరవింద్‌ గారు మొదట నాకు ఫోన్‌ చేసి బిగ్‌బాస్‌2ని హోస్ట్‌ చేయమని అడిగారు. అయితే నేను చేయగలనా?అనే డౌట్‌ నాలో ఉండేది. ఆయన మాత్రం ఎంతో కాన్ఫిడెన్స్‌గా నీవు చేయగలవని చెప్పి నన్ను నమ్మి, నాకెంతో ఆత్మవిశ్వాసం కలిగించారు..అని చెప్పుకొచ్చాడు. 

ఇక బిగ్‌బాస్‌2లో ఏదైనా జరగవచ్చు..మరింత మసాలా అంటున్నాడు నాని. దానిని బట్టి సీజన్‌1 కంటే సీజన్‌2లో మరింత మసాలా ఉంటుందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా పార్టిసిపెంట్స్‌ లిస్ట్‌ తెలిసే వరకు ఈ సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంటుంది. ఇక జూన్‌ 10నుంచి ఈ షో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 

Nani About Bigg Boss Season 2:

I Can't Follow Anyone, Says Nani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ