Advertisementt

రానా సినిమా టైటిల్ అదిరింది..!

Wed 06th Jun 2018 01:15 PM
daggubati rana,haathi mere saathi,aranya,telugu  రానా సినిమా టైటిల్ అదిరింది..!
Rana Daggubati’s next Movie Title Confirmed రానా సినిమా టైటిల్ అదిరింది..!
Advertisement
Ads by CJ

తెలుగులో హీరోగా కంటే నటునిగా మంచిపేరు తెచ్చుకున్న వ్యక్తి రానా దగ్గుబాటి. 'లీడర్‌, కృష్ణం వందే జగద్గురుం' చిత్రాలతో పాటు పలు చిత్రాలలో హీరోగా నటించాడు. కానీ సోలో హీరోగా మాత్రం ఆయన కెరీర్‌ మొదట్లో పేరు తెచ్చుకోలేకపోయాడు. 'లీడర్‌, కృష్ణం వందే జగద్గురుం' వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలను పొందాయి. కానీ కమర్షియల్‌గా మాత్రం పెద్ద హిట్‌ రాలేదు. దాంతో ఈయన తనకు నచ్చినపాత్ర చిన్నదైనా, పెద్దదైనా కూడా అతిధిపాత్ర అయినా సరే..అది ఏ భాషా చిత్రమైనా సరే ఒప్పుకుంటూ వచ్చాడు. చివరకు ఆయనకు 'బాహుబలి'లోని భళ్లాలదేవ పాత్ర దేశ విదేశాలలో గుర్తింపును తెచ్చిపెట్టింది. 

ఆ తర్వాత 'ఘాజీ ది ఎటాక్‌, నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలు కూడా మంచిహిట్‌ అయ్యాయి. ఇక ప్రస్తుతం రానా దగ్గుబాటి మూడు చిత్రాలు చేస్తున్నాడు. దీని తర్వాత టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్‌తో పాటు తేజ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన అడవుల నేపధ్యంలో ఏనుగులతో సహచర్యం చేసే జంగిల్‌ హీరో వంటి పాత్రలో రానా నటిస్తున్నాడు.ఈ చిత్రం హిందీ వెర్షన్‌ టైటిల్‌ 'హథీ మేరే సాథీ' అని పెట్టారు. ఇదే చిత్రం తమిళ వెర్షన్‌కి 'కాదన్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక తెలుగులో ఈ చిత్రం అడవులు, జంతువుల నేపధ్యంలో రూపొందుతున్న చిత్రం కావడంతో దీనికి 'అడవిరాముడు' అనే టైటిల్‌ను పెట్టనున్నారని వార్తలు వచ్చాయి. 

కానీ ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తెలుగులో ఈ చిత్రానికి 'అరణ్య' అనే సూటబుల్‌ టైటిల్‌ని ఫిక్స్‌ చేశారని తెలుస్తోంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాషల్లో హిట్‌ అవుతుందని, ఖచ్చితంగా ఈ చిత్రం తన కెరీర్‌లో పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకంతో రానా దగ్గుబాటి ఉన్నాడు. ఇక రానా త్వరలో తన కంటి ఆపరేషన్‌ కోసం విదేశాలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.

Rana Daggubati’s next Movie Title Confirmed:

Daggubati Rana's Haathi Mere Saathi as Aranya in Telugu 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ