టాలీవుడ్ లో 'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయిన మేఘ ఆకాష్ తన మొదటి సినిమాతోనే యూత్ మనసులు గెలుచుకుంది. తన క్యూట్ ఎక్సప్రెషన్ తో అందరి మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ వెంటనే నితిన్ సరసన 'ఛల్ మోహన్ రంగ' సినిమాలో యాక్ట్ చేసింది. ఆమె చేసిన రెండు సినిమాలు ప్లాప్స్ అయ్యాయి.
దాంతో ఆమె ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న టైములో ఆమె కళ్ళు తమిళ సినిమాలపై పడింది. ఆల్రెడీ అక్కడ సినిమాలు చేసిన అనుభవం ఉండటంతో.. ఈ అమ్మడుకి రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినపడుతుంది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజినీకాంత్ ఒక సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివరలో స్టార్ట్ కానుంది. బాబీ సింహ.. విజయ్ సేతుపతిలు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. మరి వీరిలో మేఘ ఆకాష్ ఎవరి సరసన నటిస్తుందో తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం భాగం కానుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.