Advertisementt

ఎన్టీఆర్, దాసరిలను గుర్తు చేసుకున్న 'కాలా'!

Wed 06th Jun 2018 11:55 AM
  ఎన్టీఆర్, దాసరిలను గుర్తు చేసుకున్న 'కాలా'!
Rajinikanth Emotional Words About Sr NTR And Dasari Narayana ఎన్టీఆర్, దాసరిలను గుర్తు చేసుకున్న 'కాలా'!
Advertisement
Ads by CJ

రజిని లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'కాలా' తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో పార్క్ హయాత్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి రజినితో పాటు.. తన అల్లుడు ధనుష్ అండ్ టీం కూడా వచ్చారు. 

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... నన్ను తమిళ్ వాళ్లు ఎంత ప్రేమిస్తారో అంతే తెలుగు వాళ్లు కూడా ప్రేమిస్తారు. అది నా భాగ్యం. తమిళ్ లో కొనసాగుదామా.. తెలుగులో కొనసాగుదామా అన్న సందేహం వచ్చినప్పుడు.. బాలచందర్ సినిమాతో తన కెరీర్ అక్కడే ప్రారంభం కావడంతో తమిళంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ గారి ఆశీస్సులు తీసుకునే వాడినని రజనీ గుర్తు చేసుకున్నారు. తన మరో గురువు దాసరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

తెలుగులో 'పెద్దరాయుడు' సినిమాతో మోహన్ బాబు నాకు బ్రేక్ ఇచ్చాడని.. అప్పుటి నుండి నా ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుందని అయన పేర్కొన్నారు. ‘ఒకే రజనీకాంత్’ అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలపై రజనీ స్పందిస్తూ ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుందని, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్.. ఇలా ఎవరికి వారేనని, ఎవరి ప్రాముఖ్యం వారిదని స్పష్టం చేశారు. 'కబాలి' సినిమా ప్లాప్ అయినప్పుడు మళ్లీ ఆ దర్శకుడికే ఎందుకు ఛాన్స్ ఇచ్చారని చాలామంది అనుకున్నారు. 'కాలా' స్టోరీ నచ్చడంతో ఏమి ఆలోచించకుండా చేసేశా అని అన్నారు. ఇది అందరికి నచ్చేలా ఉంటుందని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Rajinikanth Emotional Words About Sr NTR And Dasari Narayana:

Rajinikanth Speech at Kaala Pre Release Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ