ఫిలిం మేకర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన మారుతీ.. ఈమధ్య సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసి సక్సెస్ అయ్యాడు. మొదట్లో యూత్ మెచ్చే సినిమాలు తీసినా.. తర్వాత మెల్లగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను రూపొందించడంలో తన ట్యాలెంట్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా మారుతీ సినిమాల్లో కామెడీ చాలా కొత్తగా ఉంటది.
ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'శైలజా రెడ్డి అల్లుడు' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇంకా షూటింగ్ స్టేజిలోనే ఉన్న ఈ సినిమా బిజినెస్ చూసి ట్రేడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు తప్ప.. రెస్ట్ అఫ్ ఇండియా, ఓవర్సీస్ తో కలిపి మొత్తంగా ఓ మంచి డీల్ ను రీసెంట్ గానే ఫినిష్ చేశారట. ఏకంగా 14 కోట్లకు ఈ సినిమా అమ్మడైనట్టు తెలుస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాలతో కలిపితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా బడ్జెట్ 15 నుండి 18 కోట్లు లోపే. ఒకవేళ సినిమా హిట్ అయితే రెండు రాష్ట్రాల నుంచి వచ్చే మొత్తం అంతా లాభాలపంటే అన్నమాట. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐడ్రీమ్ మీడియా..అమెజాన్ ప్రైమ్ వారు పోటీ పడి మరీ ఈ హక్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకుండానే చైతు సినిమాకి అప్పుడే ఇంత బిజినెస్ చేయడం మాములు విషయం కాదు.