తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో పెళ్లిసందడి బాగా ఉండే సినిమాలు, తెరనిండా కొత్తకొత్త డ్రస్సులతో భారీకాస్టింగ్‌తో కనిపించే నిండైన దృశ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఇక తాజాగా ఈ శుక్రవారం విడుదలైన 'వీరే ది వెడ్డింగ్' కూడా అదే కోవలోకి వచ్చే చిత్రం. ఇందులో సోనమ్‌కపూర్, కరీనాకపూర్, స్వరాభాస్కర్, శిఖతల్సనియా వంటి భారీతారాగణం ఇందులో నటించారు. ఈ చిత్రాన్ని బూతులు, ఇతర వల్గర్ డైలాగ్స్ ఉన్నాయనే కారణంగా పాకిస్థాన్ సెన్సార్‌బోర్డ్ పవిత్ర రంజాన్ మాసంలో తమ దేశంలో విడుదల కాకూడదని ఆపివేసింది. కానీ ఇండియాలో ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్, ఇతర వర్గాల ఆదరణ బాగా ఉంది.
ఇక విషయానికి వస్తే ఈ చిత్రం కథతో పాటు ఇందులో ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశం ఇందులోని తారాగణం వేసుకున్న కాస్ట్యూమ్స్ అని ఖచ్చితంగా చెప్పాలి. వెండితెరపై మెరిసిపోయిన ఈ హీరోయిన్లు వేసుకున్న డ్రస్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు హీరోయిన్లు వేసుకున్న డ్రస్‌ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో కరీనాకపూర్ వేసుకున్న ఓ కాస్ట్యూమ్ అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. కరీనా వేసుకున్న ఈ డ్రస్‌కి మహిళలందరు ఫిదా అవుతున్నారు. ఈ డ్రస్‌కి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ప్రస్తుతం బిటౌన్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఈ సినిమాలో వచ్చే ఓ పెళ్లి సీన్‌లో కరీనా వేసుకున్న డ్రస్‌ని డిజైన్ చేసింది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబుజానీ సందీప్ ఖోస్లా. ఈ డ్రస్ చూడటానికి ఎంతో ముచ్చటగా అందంగా కరీనా అందాన్ని డామినేట్ చేసే విధంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ డ్రస్‌ని డిజైన్ చేసింది పాతికేళ్లకిందట అంటే ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రతిభను ఎంతైనా పొగడాల్సిందే. ఈ విషయాన్ని అబుజాని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.