దాదాపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా చేస్తోన్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం షూటింగ్ జెట్ స్పీడ్‌తో సాగుతోంది. ఎందుకంటే ఈ చిత్రం అనంతరం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో నటించే మల్టీస్టారర్ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు రామ్‌చరణ్ కూడా దాదాపు ఎన్టీఆర్ చిత్రానికి అటు ఇటుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. కానీ టైటిల్ ప్రకటించడం నుంచి ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల వరకు ఎన్టీఆర్ టీం మంచి జోష్ మీద ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్‌తో పాటు రామచరణ్ కూడా రాజమౌళి మల్టీస్టారర్‌లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ బోయపాటి చిత్రం మాత్రం ఎన్టీఆర్ చూపిస్తున్న దూకుడుని అందుకోలేకపోతోంది.
బహుశా ముందుగా రాజమౌళి చిత్రంలో రామ్‌చరణ్ కంటే ఎన్టీఆరే ముందుగా జాయిన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ముందు రాజమౌళి ఎన్టీఆర్‌పై తీయాల్సిన సోలో సీన్స్ అన్ని రామ్‌చరణ్ కంటే ముందుగానే తీసే అవకాశాలు ఉన్నాయి. ఇక బోయపాటి -రామ్‌చరణ్ చిత్రం టైటిల్ కూడా ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం ఆల్‌రెడీ 30శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈరోజు నుంచి హైదరాబాద్‌లో వేసిన అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద షెడ్యూల్ నెలరోజుల పాటు నిరవధికంగా జరగనుంది. ఎన్టీఆర్ అలియాస్ వీరరాఘవ మాత్రం నోరెస్ట్ అంటున్నాడు. ఈ షెడ్యూల్‌తో పాటు తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్, పూజాహెగ్డేలపై వచ్చే పాటలను కూడా తీయడానికి త్రివిక్రమ్ ఎన్టీఆర్‌లు రెడీ అవుతున్నారు.
ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే రామ్‌చరణ్-బోయపాటిలు మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ డేట్ అనుకుంటున్నారని సమాచారం. మరి ఈ రెండు చిత్రాలలో ఏది పెద్ద విజయం సాధిస్తుందో వేచిచూడాల్సివుంది....!