Advertisementt

‘సామి స్క్వేర్’ ట్రైలర్ టాకేంటి..?

Tue 05th Jun 2018 02:28 PM
saamy square,saamy square trailer,hari director,saamy square movie,keerthi suresh,chiyaan vikram  ‘సామి స్క్వేర్’ ట్రైలర్ టాకేంటి..?
Saamy Square Trailer Released ‘సామి స్క్వేర్’ ట్రైలర్ టాకేంటి..?
Advertisement
Ads by CJ

తమిళ దర్శకుడు హరి గురించి ఆయన టేకింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అతను హీరోను చూపించే విధానం అందరికి మతిపోవాల్సిందే. హీరోయిజంని ఓవర్ ద బోర్డ్ చూపించడం అతనికి పెట్టింది పేరు. హరి సినిమాల్లో డైలాగ్స్ కానీ.. చేజింగ్ కానీ.. ఫైటింగ్ సీన్స్ కానీ చాలా అతిగా అనిపిస్తుంటాయి. అంతేకాదు హీరో ఫేస్ ని ఓ సింహంలానో.. పులిలానో చూపించడం అతనికి అలవాటు.

ఇప్పటి వరకు హరి 'సింగం' కి సంబంధించి మూడు పార్ట్స్ తీశాడు. మొన్న వచ్చిన 'సింగం 3' సరిగా ఆడలేదు. ఈ మూడు సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్ ఒకేలా ఉంటుంది. మళ్లీ మళ్లీ ఇదే స్టయిల్లో సినిమాలు తీయడంతో జనాలకు మొహం మొత్తేసింది. అయినా కానీ హరి తన రూట్ మార్చుకోలేదు. తాను 14 ఏళ్ల కిందట తీసిన పోలీస్ సినిమా ‘సామి’కి సీక్వెల్ తో రెడీ అయ్యాడు.

‘సామి స్క్వేర్’ అనే టైటిల్ తెరకెక్కిస్తున్న చిత్రం యొక్క ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ లో మొదటి ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు అతిగానే ఉంది. అవసరం లేని స్పెషల్ ఎఫెక్టులు.. హీరో చెప్పే అతి డైలాగులు ఈ సినిమాను నెగటివ్ షేడ్ కి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు మాస్ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవ్వుతారో లేదో చెప్పలేం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా.. విలన్ గా బాబీ సింహ చేస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ఇదే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు.

Click Here for Trailer

Saamy Square Trailer Released:

Saamy Square Trailer Report 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ