మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ 150' తర్వాత చేస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. భారీ బడ్జెట్ తో చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో పాటు.. విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చిరుకి జోడిగా కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. దాదాపు 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి 2019 కి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ 2019 వేసవిలో రిలీజ్ చేయాలని నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్ సినిమా కావటంతో సమ్మర్ లో రిలీజ్ అయితే కలెక్షన్స్ బాగా వచ్చే అవకాశం ఉందని నిర్మాత రామ్ చరణ్ అటు దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాకి భారీ లెవెల్ లో గ్రాఫిక్స్ వర్క్ ఉండడంతో షూటింగ్ ను త్వరగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కు త్వరగా పంపాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. మరో పక్క చిరంజీవి ఈ సినిమాతో పాటు కొరటాల సినిమాకి కూడా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం.