ఇటీవల నాని నిర్మాతగా ప్రశాంత్‌వర్మ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన 'అ!' చిత్రంలో నాని చేపకి వాయిస్‌ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నాని హోస్ట్‌గా చేసే బిగ్‌బాస్ సీజన్2కి సంబంధించిన కొత్త ప్రోమో వంటి టీజర్‌ని వదిలారు. జూన్ 10.. 16 మంది సెలబ్రిటీలు... 100రోజులు.. ఒక బిగ్‌హౌస్..బిగ్‌బాస్2' అంటూ మరోసారి నాని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో కూడా ఆయన అక్వేరియంలోని చేపలను చూపుతూ, నాని పలు డైలాగులు చెప్పాడు.
ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోరకం.. స్నేహితులు, ప్రేమికులు, నవ్వించేవాళ్లు, కవ్వించే వాళ్లు.. మిలమిలా మెరిసేవారు.. అంటూ ఎవరికేం కావాలో..ఎవరేం కావాలో డిసైడ్ చేసిది బిగ్‌బాస్2 అని నాని చెప్పినడైలాగ్స్ బిగ్‌బాస్2పై అంచనాలను పెంచేవిగా ఉన్నాయి. ఇక ఈ బిగ్‌బాస్ సీజన్2లో పాల్గొనే సెలబ్రిటీలు అంటూ ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ తరుణ్ వంటి వారు వాటిని కొట్టిపడేశారు. దీనిని బట్టి ఈ పార్టిసిపెంట్స్ లిస్ట్ అంతా ఊహాజనితం అని అర్ధమవుతోంది.
ఇక నిజంగా ఈ బిగ్‌బాస్2లో ఎవరు పార్టిసిపెంట్స్‌గా ఉంటారో తెలుసుకోవాలంటే ఈ షో నిర్వాహకులు అఫీషియల్‌గా వారిని ప్రకటించే వరకు వెయిట్ చేయాలి. ముందుగా ప్రకటించకపోతే జూన్ 10వ తేదీన స్టార్ మా టీవీకి అతుక్కుపోవడం తప్ప వేరే మార్గం లేదనే చెప్పాలి.