ఏ ముహూర్తాన తాప్సిపన్ను దక్షిణాదిని వదిలేసి బాలీవుడ్‌కి వెళ్లిందో గానీ ఆమెకి వరుసగా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. నటిగా తనను తాను నిరూపించుకునే అవకాశాలతో పాటు 'జుడ్వా2' ద్వారా తనలోని గ్లామర్ యాంగిల్‌ని కూడా ఆమె చూపించడంతో ఇక ఈమెకి బాలీవుడ్‌లో ఎదురేలేకుండా పోతోంది. ఎంతగా ఆమె హవా సాగుతోందంటే ఆమెని వెతుక్కుంటూ వచ్చిన మంచి మంచి అవకాశాలను కూడా ఆమె కాల్షీట్స్ ప్రాబ్లమ్ వల్ల నో అని చెప్పేంతగా ఆమె స్పీడ్ చూపిస్తోంది.
ఇక తాజాగా ఆమె బాలీవుడ్‌తో పాటు దేశం గర్వించదగ్గ టాప్ క్లాస్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీతో నటించే అవకాశాన్ని వదులుకుందని వార్తలు వచ్చాయి. నవాజుద్దీన్ సిద్దిఖీ, తాప్సిలతో ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తీయాలని దర్శకుడు హనీ తెహ్రాన్ భావించాడు. కానీ నవాజుద్దీన్ సిద్దిఖీతో కలిసి నటించడానికి ఏవో క్రియేటివ్ డిఫరెన్స్‌ల వల్ల తాప్సి నో చెప్పిందనే వార్త బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దాంతో తాప్సికి యాంటీగా ఓ ఆర్టికల్‌ని రాసిన వెబ్‌సైట్‌ని ఉద్దేశించి తాప్సి మాట్లాడుతూ, మీ హెడ్‌లైన్స్ కోసం ఏవేవో రాయవద్దు. ఏదైనా విషయం గురించి కొంచెం కొంచెం తెలిసినప్పుడు సమాచారం అని రాసుకోవాలి. అంతేగానీ అంతా తెలిసినట్లు మా మీద నెట్టేయడం సరికాదు. యాక్టర్‌గా నాకు చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. అన్నింటిని ఒప్పుకోవాలంటే కష్టం.
ఏదైనా సినిమా ఒప్పుకోకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. నేను మాత్రం ఫలానా యాక్టర్‌తో నటించనని చెప్పి సినిమా వదులుకునే పనులు చేయను. హనీ తెహ్రాన్ తన మొదటి చిత్రానికే నన్ను తీసుకోవాలని అనుకోవడం ఎంతో గ్రేట్‌గా ఫీలవుతున్నాను. నవాజుద్దీన్ సిద్దిఖీ గారి టాలెంట్ మీద నాకెంతో గౌరవం ఉంది. భవిష్యత్తులో ఆయనతో కలిసి నటిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ఈమె తెలుగులో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న 'నీవెవరో' చిత్రంలో షాలిని పాండేతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.