ఎన్టీఆర్ బయోపిక్ ని బాలకృష్ణ ఏమంటూ అనౌన్స్ చేశాడో... అప్పటి నుండి మొదలైంది రచ్చ. బాలయ్య అలా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని చెప్పాడో లేదో.. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ నానా రచ్చ చేశాడు. సరే వర్మ విషయం సర్దుమణిగింది అంటే... ఈ సినిమాకి దర్శకుడిగా పనిచేయాల్సిన తేజ ఉన్నట్టుండి ఎన్టీఆర్ బయోపిక్ నుండి బయటికి వచ్చేశాడు. బాలకృష్ణతో పొసగలేదో ఏమో తెలియదు గాని తేజ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ని చేయలేనని చెప్పేశాడు. ఇక బాలయ్య వున్న నెలంతా ఆలోచించి ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకుడు క్రిష్ చేతిలో పెట్టాడు.
మరి గౌతమీపుత్ర శాతకర్ణితో సూపర్ హిట్ ఇచ్చిన క్రిష్ కి ఎన్టీఆర్ బాధ్యతలను బాలయ్య అప్పగించాడు. ఇక క్రిష్ చేతుల్లోకి ఎన్టీఆర్ బయోపిక్ రావడంతో నందమూరి అభిమానులు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఒకపక్క ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ పనులు ఇబ్బంది పెడుతుంటే... మరోపక్క దర్శకుడు క్రిష్ ఇప్పుడు పర్సనల్ గా కొన్ని ఇబ్బందులు పడుతున్నాడు. తన భార్య రమ్యకి క్రిష్ విడాకులివ్వబోతున్నాడంటూ గత రెండు రోజులుగా రకరకాల న్యూస్ లు మీడియాలో వెలువడుతున్నాయి.
మరి అటు ఎన్టీఆర్ బయోపిక్ గురించిన ప్రకటన వెలువడిన తర్వాత లక్ష్మి పార్వతి ఆ సినిమాని విడుదలవ్వనివ్వనని శపధం చేసింది. ఇటు చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ కి అనుకున్న దర్శకులు ఇబ్బందుల్లో పడుతున్నారు. మరి ప్రస్తుతం బాలకృష్ణ మాత్రం సైలెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ విషయాన్నీ పక్కన పెట్టేసి.. తన తదుపరి ప్రాజెక్టుల మీద ఏమన్నా.. మనసు పెడతాడా... లేదంటే అబ్బే అదేం లేదండి అంటూ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో సీరియస్ గా పనులు మొదలు పెడతాడా అనేది మాత్రం తెలియాల్సి ఉండగా.. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ జులై నెలాఖరు నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.