ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌ఫిట్ హైతో ఇండియా ఫిట్ అనే ఛాలెంజ్ వైరల్ అవుతోంది.ఈ సందర్భంగా తనకి ఛాలెంజ్ వచ్చిన సందర్భంగా సమంత ఫిట్‌నెస్, వ్యాయామం గురించి మాట్లాడుతూ, నా దృష్టిలో ఫిట్‌నెస్ అంటే అట్రాక్టివ్‌గా ఉండేలా చేసే వర్క్ కాదు. క్రమశిక్షణ, గౌరవం, ఆత్మవిశ్వాసం వంటివన్నీ ఎక్సర్‌సైజుల వల్ల ఏర్పడతాయి అని చెప్పుకొచ్చింది. ఈ స్టేట్‌మెంట్‌ని బట్టే సమంత ఫిట్‌నెస్‌కి ఎంత విలువ ఇస్తారో అర్ధమవుతోంది. తాజాగా ఈమె ఏకంగా పది కిలోల బరువును మోస్తూ చేసిన జిమ్ ఎక్సర్‌సైజులు ఎవరికైనా వావ్ అనిపిస్తాయనే చెప్పాలి.
ఇక తాజాగా ఈమె తమిళంలో విశాల్‌తో కలిసి నటించిన 'అభిమన్యుడు' చిత్రం విడుదలై మిగిలిన రెండు చిత్రాల కన్నా ఫర్వాలేదనే టాక్‌ని తెచ్చుకుంది. మరోవైపు సమంత ప్రస్తుతం కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన 'యూటర్న్'ని తానే లీడ్‌రోల్‌లో తెలుగు, తమిళ భాషల్లో చేస్తోంది. కన్నడ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన పవన్‌కుమారే తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో సమంత, భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ వంటి నటీనటులు నటిస్తున్నారు. ఇక ఇందులో సమంత జర్నలిస్ట్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సమంత, ఓ పాప, భూమిక కూర్చుని ఉండగా, డ్రైవ్ చేస్తోన్న సమంత లెఫ్ట్‌కి వెళ్లాలా?రైట్‌కి టర్న్ తీసుకోవాలా? ఎక్కడ యూటర్న్ తీసుకోవాలి అనే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నట్లుగా ఉంది. ఇక ఈ స్కూటర్‌పై ఉన్న పాప సినిమాలో భూమికకి కూతురుగా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 50శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.