Advertisementt

RRR.. ఆ హాలీవుడ్ సినిమా స్టోరీనా!?

Sun 03rd Jun 2018 05:29 PM
rrr,rajamouli,charan,jr ntr,hollywood movie,gangsters  RRR.. ఆ హాలీవుడ్ సినిమా స్టోరీనా!?
Rajamouli Following Current Trend For RRR RRR.. ఆ హాలీవుడ్ సినిమా స్టోరీనా!?
Advertisement
Ads by CJ

రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టార్రర్ సినిమా కోసం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ -రామ్ చరణ్ పాత్రలతో పాటు సినిమా కథ ఏంటనే అంశంపై చాలానే డిస్కషన్స్ జరుగుతున్నాయి.

RRR కథపై ఇప్పటికే చాలా రకాల వార్తాలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ గాను.. చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారనే వార్త ఇప్పటికే టాలీవుడ్ ని షేక్ చేసింది. మళ్లీ ఇప్పుడు ఈ కథపై ఓ వార్త హల్ చల్ చేస్తుంది. కథ మొత్తం కాదు కానీ కొన్ని కీలక సన్నివేశాలను మాత్రం అమెరికన్ గ్యాంగ్ స్టర్ అనే హాలీవుడ్ మూవీ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారట.

అందులో కొన్ని సీన్స్ ను రాజమౌళి ఇన్స్పిరేషన్ గా తీసుకుని దాని తగ్గట్టే కథను రెడీ చేస్తున్నారట. దాంతో అమెరికన్ గ్యాంగ్ స్టర్ కు.. ఈ చిత్రానికి దగ్గర పోలికలు పెద్దగా ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇందులో అన్నయ్య పాత్రలో ఎన్టీఆర్ ఓ గ్యాంగ్ స్టర్ గా...తమ్ముడు పాత్రలో రామ్ చరణ్ పోలీస్ గా తన విశ్వరూపం చూపించనున్నాడట. ఫ్యామిలీలో జరిగే కొన్ని గొడవలు కారణంగా ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ గా మారగా అతడితో పోటీ పడే తమ్ముడి రోల్ లో చెర్రీ యాక్ట్ చేయనున్నాడని అంటున్నారు.

Rajamouli Following Current Trend For RRR:

Rumour: Rajamouli copied hollywood story for RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ