Advertisementt

ప్రభాస్ అండ్ రాజమౌళి సేమ్ టు సేమ్..!

Sun 03rd Jun 2018 01:47 PM
ss rajamouli,prabhas,gangsters,ram charan,baahubali,jr ntr  ప్రభాస్ అండ్ రాజమౌళి సేమ్ టు సేమ్..!
SS Rajamouli and Prabhas in Same Way ప్రభాస్ అండ్ రాజమౌళి సేమ్ టు సేమ్..!
Advertisement
Ads by CJ

'బాహుబలి' రెండు పార్ట్స్ కోసం ప్రభాస్ అండ్ రాజమౌళి దగ్గర దగ్గరగా నాలుగేళ్లు సమయాన్ని తీసుకున్నారు. తీసుకుంటే తీసుకున్నారు కానీ ఇండియా మొత్తం గర్వించే ఓ అద్భుతమైన సినిమాను ఇచ్చారు. 'బాహుబలి' ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనం చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు ఎవరి బాటలో వారు సినిమా చేసుకుంటున్నారు.

ప్రభాస్ చాలాకాలం నుండి సుజీత్ డైరెక్షన్ లో 'సాహో' అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి ఈ సినిమా షూటింగ్ చాలా నెమ్మదిగా జరగగా...రీసెంట్ గా అబుదాబి షెడ్యూల్ ను పూర్తి చేయడంతో..ఈ సినిమా షూటింగ్ ఇప్పుడే ఓ కొలిక్కి చేరుకుంది. మొదట రిలీజ్ చేసిన టీజర్ పరంగా చూసుకుంటే ఇదో గ్యాంగ్ స్టర్ బేస్డ్ మూవీ అనే సంగతి అర్ధం అవుతూనే ఉంది. 

అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే రాజమౌళి కూడా గ్యాంగ్ స్టర్ సబ్జెక్టునే ఎంచుకున్నాడు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ అన్నాతమ్ముళ్ల పాత్రలో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ మూవీ.. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ గాను.. రామ్ చరణ్ పోలీస్ గాను కనిపిస్తారని.. వాళ్లిద్దరూ అన్నాదమ్ముల పాత్రలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే అటు ప్రభాస్.. ఇటు రాజమౌళి ఇద్దరు 'బాహుబలి' తర్వాత ఒకే తరహా కథతో వస్తున్నారు. మరి వీరిలో ఎవరు పెద్ద హిట్టు కొడతారో? చూద్దాం!

SS Rajamouli and Prabhas in Same Way:

SS Rajamouli and Young Rebel Star Prabhas next Movies After Baahubali

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ