Advertisementt

వెంకీ కోసం మరో బాలీవుడ్ భామ..!

Sun 03rd Jun 2018 01:21 PM
huma qureshi,venkatesh,bollywood heroine,katrina kaif,preethi zintha,bobby  వెంకీ కోసం మరో బాలీవుడ్ భామ..!
Bollywood Beauty Huma Qureshi To romance with Venkatesh వెంకీ కోసం మరో బాలీవుడ్ భామ..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోస్ పక్కన నటించేందుకు హీరోయిన్స్ ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే ఆయా హీరోలు మరి చిన్న వయసున్న హీరోయిన్స్ తో అయినా.... లేదా పరభాషా హీరోయిన్స్ మీదనైనా ఆధార పడాల్సిన పరిస్థితి. ఇక సీనియర్ హీరోస్ కి ఆప్షన్ గా ఉన్న నయనతార, అనుష్క, శ్రియ వంటి హీరోయిన్స్ లో నయనతార ఒక్కటే బెస్ట్ ఆప్షన్ గా ఉంది. కానీ నయనతారకున్న కమిట్మెంట్స్ తో ఆమె అందరికి అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం సీనియర్ హీరోస్ లో ఒకరైన వెంకటేష్ పక్కన నటించే హీరోయిన్స్ కోసం వేట మాములుగా సాగడం లేదు.

ప్రస్తుతం వెంకటేష్ రెండు మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో ఎఫ్ 2 అనే మల్టీస్టారర్ లో నటిస్తున్న వెంకటేష్ కి జోడీగా తమన్నా నటిస్తుంది. అలాగే నాగ చైతన్య - వెంకటేష్ కలిసి బాబీ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో వెంకటేష్ కి జోడీగా 'కాలా' భామ హ్యూమా ఖురేషి నటిస్తుందని టాక్ బయటికి వచ్చింది. కాలా సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్న ఈ బాలీవుడ్ భామ ఇప్పుడు టాలీవుడ్ లోకి వెంకీ కోసం దిగుమతి అవుతుంది.

ఇక వెంకటేష్ కి బాలీవుడ్ హీరోయిన్స్ తో నటించడం కొత్తేమీ కాదు. గతంలో మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ తోను, ప్రేమంటే ఇదేరా సినిమాలో ప్రీతీ జింటా తో నటించారు కూడా. ఇక ఇప్పుడు వెంకీ సరసన నటించే సీనియర్ భామలెవరు లేకపోవడం బాబీ అండ్ కో హ్యూమా ఖురేషిని వెంకటేష్ కి జోడిగా నటించాలని సంప్రదించగా.. ఆమె ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... తర్వాత కొంత సమయం కావాలని అడిగినట్టుగా తెలుస్తుంది. ఇక 'కాలా'కి అందుకున్న పారితోషికానికి సమానంగా అయితే ఇవ్వలేం కానీ.. బాగానే ఇచ్చుకుంటామని మేకర్స్ హ్యూమాకి మాటివ్వడంతో.. వెంటనే ఈ సినిమాలో చెయ్యడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది.

Bollywood Beauty Huma Qureshi To romance with Venkatesh:

Huma Qureshi to star Opposite Venkatesh in her first Telugu Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ