Advertisementt

ఎఫైర్ పై రాహుల్‌ నోరు విప్పితే బాగుంటుంది!

Sat 02nd Jun 2018 11:05 PM
kl rahul,dinner,nidhi agarwal,affair,cricketer  ఎఫైర్ పై రాహుల్‌ నోరు విప్పితే బాగుంటుంది!
Nidhhi Agerwal opens up on affair with cricketer KL Rahul ఎఫైర్ పై రాహుల్‌ నోరు విప్పితే బాగుంటుంది!
Advertisement
Ads by CJ

సినిమా వారికి, క్రికెటర్లకి ఉండే బంధం గురించి అందరికీ తెలిసిందే. నాడు నవాబ్‌ పటౌడీ, షర్మిలాఠాగూర్‌ నుంచి అజారుద్దీన్‌-సంగీత బిజిలాని, విరాట్‌కోహ్లి-అనుష్కశర్మ వరకు ఈ లిస్ట్‌లో చాలా మంది ఉన్నారు. ఇక కేవలం ఎఫైర్లతోనే గడిపిన వారిలో రవిశాస్త్రి-అమృతాసింగ్‌, ధోనీ-లక్ష్మీరాయ్‌, యువరాజ్‌సింగ్‌-కిమ్‌శర్మ, సౌరవ్‌గంగూలీ-నగ్మా, కపిల్‌దేవ్‌-సారిక, కపిల్‌-సుమలత వంటి ఎందరో ఉన్నారు. ఈ లిస్ట్‌లోకి తాజాగా ఇండియన్‌ క్రికెటర్‌, బెంగుళూరు వాసి, టెస్ట్‌లు, వన్డేలు, టి20ల వంటి మూడు ఫార్మాట్లలో తనదైన శైలిలో ఓపెనర్‌గా దూసుకెళ్తున్న కె.ఎల్‌.రాహుల్‌ కూడా చేరాడు. 

ఈయన తాజాగా 'మున్నా మైఖేల్‌' అనే చిత్రంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తూ, త్వరలో అక్కినేని అఖిల్‌ సరసన కూడా నటించనున్న నిధి అగర్వల్‌.. కె.ఎల్‌.రాహుల్‌తో కలిసి ముంబైలోని బాంద్రాలోని రెస్టారెంట్‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని జాతీయ మీడియాతో పాటు బాలీవుడ్‌ కూడా కోడై కూస్తోంది. దీని గురించి తాజాగా నిధి అగర్వాల్‌ స్పందించింది. నాకు రాహుల్‌ ఎంతో కాలం నుంచి తెలుసు. మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామనేది నిజం కాదు. నేను నటిని కాకముందు , కె.ఎల్‌ రాహుల్‌ ఇండియా టీంలోకి రాకముందు నుంచే మా మధ్య మంచి పరిచయం ఉంది. నేను, రాహుల్‌ కలిసి డిన్నర్‌కి వెళ్లింది నిజమే. మా ఇద్దరికి ఎప్పటినుంచో పరిచయం ఉంది... అని వివరణ ఇచ్చింది. 

మరోవైపు కె.ఎల్‌.రాహుల్‌ మాత్రం ఈ విషయం జాతీయ మీడియాలలో హెడ్‌లైన్స్‌గా వచ్చినా కూడా పెదవి విప్పడం లేదు. ఈ ఇద్దరు తమ కెరీర్‌ పరంగా స్టార్టింగ్‌ స్టేజీలోనే ఉన్నారు. కాబట్టే వీరు అసలు విషయాన్ని దాస్తున్నారనే వాదన కూడా ఉంది. ఏదైనా సరే నిప్పులేనిదే పొగరాదు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో వేచిచూడాల్సివుంది..! 

Nidhhi Agerwal opens up on affair with cricketer KL Rahul:

Cricketer KL Rahul spotted on dinner date with actress Niddhi Agarwal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ