Advertisementt

మహేష్ గడ్డం లుక్ చూశారా..!!

Sat 02nd Jun 2018 03:37 PM
mahesh babu,namratha,latest look,25 movie  మహేష్ గడ్డం లుక్ చూశారా..!!
Mahesh's Beard from Back! మహేష్ గడ్డం లుక్ చూశారా..!!
Advertisement
Ads by CJ

తాను నటించిన 24 చిత్రాలలో కథపరంగా పలు ప్రయోగాలు చేసిన మహేష్‌బాబు లుక్స్‌పరంగా మాత్రం పెద్దగా డిఫరెంట్‌గా ట్రై చేయలేదు. అదే హెయిర్‌స్టైల్ అదే లుక్స్‌లో కనిపించేవాడు. కానీ తన 25వ చిత్రంలో మాత్రం లుక్‌ పరంగా డిఫరెంట్‌గా కనిపిస్తానని మహేష్‌ ఇప్పటికే చెప్పాడు. ఈయన కథల పరంగా 'నిజం, నాని, స్పైడర్‌' వంటి ఎన్నో ప్రయోగాలు చేసిన విధంగానే ఈ చిత్రం హిట్‌ అయితే ఇక నుంచి మహేష్‌ని కూడా సినిమా సినిమాకి కొత్తగా చూసే అవకాశం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇక 'భరత్‌ అనే నేనే' బ్లాక్‌బస్టర్‌ సాధించిన హ్యాపీలో ఉన్న మహేష్‌ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి స్పెయిన్‌లో హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈయన హైదరాబాద్‌కి వచ్చిన వెంటనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. మొదట ఈ చిత్రం ఫస్ట్‌షెడ్యూల్‌ని అమెరికాలో చాలా రోజుల పాటు జరిగేలా ప్లాన్‌ చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం మొదటి షెడ్యూల్‌ని మన దేశంలోనే నార్త్‌ ఇండియాలో జరిపి, ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చిన తర్వాత యూఎస్‌ షెడ్యూల్‌కి వెళ్లనున్నారు. 

ఇక తాజాగా నమ్రతా తన కుమార్తె సితారతో ఆడుకుంటున్న తన భర్త ఫొటోని పోస్ట్‌ చేసింది. ఫేస్‌ ముందు నుంచి కనిపించకపోయినా సైడ్‌లుక్‌లో పెంచిన గడ్డం, వెనుక నుంచి హెయిర్‌స్టైల్‌ ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయి.

Mahesh's Beard from Back!:

Mahesh Latest Look Taken by Namratha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ