రాజమౌళి డైరెక్షన్ లో రామారావు, రామ్ చరణ్ ల భారీ మల్టీస్టారర్ మూవీ. ఈ సినిమాపై అసలైన కథానాయకులెవరూ.... ఎలాంటి విషయాల్లోనూ స్పందించడం లేదు. కానీ సోషల్ మీడియాలో నిత్యం RRR పై రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే రాజమౌళి.. చరణ్ తోనూ, ఎన్టీఆర్ తోనూ సినిమాని ప్రకటించేటప్పటికే... కథ రెడీగా ఉండి ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి కథ సెట్ చేశాకే.. ఆ కథలో ఏ హీరో అయితే సరిపోతాడా చూసుకుని మరీ... ఆ హీరోల పేర్లు బయటికి ప్రకటిస్తారు. అయితే ఆ కథ ఏమిటనేది ప్రస్తుతానికి ఎన్టీఆర్ కి గాని చరణ్ కి గాని తెలియదు. అయితే గత వారంలో రాజమౌళితో చెర్రీ, ఎన్టీఆర్ లు స్టోరీ సిట్టింగ్స్ లో పాల్గొనబోతున్నారంటూ.. కొన్ని వార్తలు హల్చల్ చేశాయి.
అయితే నిన్నమొన్నటి వరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు అన్నదమ్ములుగా కనబడతారని.. చరణ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని... కానీ ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ రోల్ ఏమిటంటూ క్వశ్చన్ మార్క్ తో బోలెడన్ని న్యూస్ లు ప్రచారం జరిగాయి. ఇక అప్పటి నుండి రాజమౌళి సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ అయితే... ఎన్టీఆర్ రోల్ మీద అందరిలో ఎడతెగని ఆసక్తి ఏర్పడింది. అయితే తాజాగా ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తాడనే టాక్ వినబడుతుంది. ఈ సినిమాలో చరణ్ అండ్ ఎన్టీఆర్ లిద్దరూ సోదరులే అయినప్పటికీ వాళ్లు ఎంచుకున్న మార్గాలు వేరు. ఈ పరిస్థితుల్లో చోటుచేసుకునే పరిణామాలతో కథ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతోందనే టాక్ నడుస్తుంది.
మరి ఈ విషయంలో నిజమెంతుందో.... తెలియదు కానీ.. చరణ్ పోలీస్, ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ అనే న్యూస్ మాత్రం సోషల్ ఇండియాలో తెగ హైలైట్ అయ్యింది. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇకపోతే.... ఈ సినిమా కోసం రాజమౌళి పూర్తి స్క్రిప్ట్ తో నటీనటుల ఎంపిక చేపట్టి.. అక్టోబర్ లో ఈ సినిమాని పట్టాలెక్కిస్తాడని తెలుస్తుంది.