Advertisementt

'సమ్మోహనం' ట్రైలర్: ఇంట్రెస్టింగ్ గానే వుంది!

Sat 02nd Jun 2018 01:42 PM
sudheer babu,sammohanam,sammohanam trailer,mohana krishna indraganti  'సమ్మోహనం' ట్రైలర్: ఇంట్రెస్టింగ్ గానే వుంది!
Sammohanam Movie Trailer Released 'సమ్మోహనం' ట్రైలర్: ఇంట్రెస్టింగ్ గానే వుంది!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌లో మహేష్‌ బావ సుధీర్‌బాబుకి 'ప్రేమకధా చిత్రమ్‌' మాత్రమే పెద్ద హిట్‌. ఆ తర్వాత వచ్చిన 'భలే మంచి రోజు'తో పాటు పలు చిత్రాలు ఫర్వాలేదనిపించినా ప్రేక్షకులను థియేటర్లకు తేలేకపోయాయి. ఆ మధ్యలో ఆయన బాలీవుడ్‌లో 'వర్షం' చిత్రానికి రీమేక్‌గా చేసిన 'భాఘీ' చిత్రంలో తెలుగులో గోపీచంద్‌ చేసిన పాత్రను చేశాడు. ఇక విషయానికి వస్తే అచ్చమైన తెలుగు చిత్రాలను, ఎంతో ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో చూపించే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన ప్రస్తుతం సుధీర్‌బాబు, అదితీరావులతో 'సమ్మోహనం' అనే చిత్రం తీశాడు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ని కృష్ణ బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. 

ఇక ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను ఈనెల 10వ తేదీన ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి ముఖ్యఅతిధిగా మహేష్‌బాబు వస్తాడని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, నానిలతో సోషల్‌మీడియా ద్వారా కూడా ప్రమోషన్స్‌ చేయించే ప్లాన్‌లో సుధీర్‌బాబు ఉన్నాడు. ఈ చిత్రం ట్రైలర్‌ చూసిన చిరంజీవి సైతం ఈ చిత్రం హిట్‌ గ్యారంటీ అని చెప్పాడట. ఇకపోతే ఈ కథ సినిమా ప్రపంచం చుట్టు తిరగనుంది. హీరోయిన్‌ సినిమాలలో కథానాయికగా నటిస్తుండగా, ఆమెని ప్రేమించే యువకుడి పాత్రలో సుధీర్‌బాబు కనిపిస్తున్నాడు. 'ఈ సినిమా వాళ్ల మీద నాకున్న ఒపీనియన్‌ అంతా తప్పనుకున్నాను. నిన్ను కలిసిన తర్వాత కాదని చెంపపగుల గొట్టి మరీ ప్రూవ్‌ చేశావు' అనే ఎమోషనల్‌ డైలాగ్‌ బాగా ఆకట్టుకుంది. 

ఇక ఈ చిత్రంలో రివ్యూ రేటింగ్‌ల కోసం బ్లాక్‌మెయిల్‌ చేసే జర్నలిస్ట్‌లపై కూడా పంచ్‌ వేశారు. 'ఓవర్‌సీస్‌ డిస్ట్రిబ్యూటర్లు మన రేటింగ్‌ కోసం పిట్స్‌బర్గ్‌లో పొర్లుదండాలు పెట్టాలిరా' అనే పంచ్‌ కూడా బాగా పేలింది. ఇక ఈ చిత్రం ఈనెల 15 వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది....! 

Click Here For Trailer

Sammohanam Movie Trailer Released:

Sammohanam Movie Trailer Report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ