ఈ ఏడాది వచ్చిన రామ్‌చరణ్-సుకుమార్‌ల చిత్రం 'రంగస్థలం'.. 'బాహుబలి-ది కన్‌క్లూజన్, బాహుబలి-ది బిగినింగ్'ల తర్వాత నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టి మూడో స్థానంలో నిలిచింది. 1980ల కాలం నాటి గ్రామీణ నేపధ్యంలో సాగే కథ, కథనాలకు నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం, పాత్రలను మలచిన తీరు, సంగీతం, సాహిత్యం వంటివన్నీ జీవం పోశాయి. ఇక ఈ చిత్రం ఆడియో విడుదలైన నాటి నుంచే ఈ చిత్రంలోని పాటలు అందరినీ ఓ ఊపు ఊపుతూ ఉర్రూతలూగిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా 'రంగమ్మా.మంగమ్మా' పాట అయితే పిచ్చిపీక్స్‌లో ఉంది. అంతలా ఈ పాట అందరినీ అలరిస్తోంది. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత ఈ పాట పిక్చరైజేషన్, సమంత డ్యాన్స్ యూత్‌కి మత్తెక్కించాయి. ఇక ఈ పాటను యూట్యూబ్‌లో పెట్టగా కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఈ పాటకు 40మిలియన్స్‌కు పైగా వ్యూస్ లభించాయి. ఇక దీనికి ముందు వచ్చిన 'బాహుబలి'లోని 'సాహోరే', 'ఫిదా' చిత్రంలోని 'వచ్చిండే మెల్లమెల్లగా వచ్చిండే' అనే రెండు పాటలు 120 మిలియన్ వ్యూస్‌ని సొంతం చేసుకున్నాయి.
కానీ అతి తక్కువ కాల వ్యవధిలో చూసుకుంటే మాత్రం 'రంగస్థలం'లోని 'రంగమ్మ... మంగమ్మ' పాటే ఎక్కువ వ్యూస్‌ని సాధించినట్లు చెప్పవచ్చు ఎందుకంటే 'బాహుబలి, ఫిదా' చిత్రాల పాటలు యూట్యూబ్‌లో పెట్టి 10నెలలు దాటుతోంది. కానీ కేవలం నెలరోజుల్లోనే 'రంగమ్మ.. మంగమ్మ' సాధించిన 40 మిలియన్ల లెక్కలో తీసుకుంటే మిగిలిన అన్ని చిత్రాల పాటలకంటే 10నెలల వ్యవధిలో ఈ పాటే ఎక్కువ వ్యూస్‌ని సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.