Advertisementt

అల్లువారి అన్నదమ్ముల అనుబంధం..!

Sat 02nd Jun 2018 12:35 AM
allu arjun,allu sirish,birthday,celebrations,social media  అల్లువారి అన్నదమ్ముల అనుబంధం..!
Allu Sirish Celebrates His Birthday with Brother's Family అల్లువారి అన్నదమ్ముల అనుబంధం..!
Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమలో నటునిగా అల్లురామలింగయ్యకి ఎంతో పేరుంది. ఇక ఈయన కుమారుడు అల్లు అరవింద్‌ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో పాటు అన్నితరహా చిత్రాలు తీస్తూ మెగా ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన కుమారులైన అల్లుఅర్జున్‌, అల్లుశిరీష్‌లు తమ తాతయ్య, తండ్రి, మావయ్యల పేర్లు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ఆల్‌రెడీ సూపర్‌ స్టార్‌డమ్‌తో టాప్‌ 5 హీరోలలో ఒకడిగా కొనసాగుతుండగా, ఆయన సోదరుడు అల్లుశిరీష్‌ కెరీర్‌ మాత్రం ఇంకా గాడిలో పడలేదు. 'గౌరవం' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 'కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్కక్షణం' వంటి చిత్రాలలో నటించాడు. వీటిలో ఏదో పరుశురాం టాలెంట్‌ పుణ్యమా అని 'శ్రీరస్తు-శుభమస్తు' మాత్రమే యావరేజ్‌ అనిపించుకుంది. 

ఇక ఈయన 'ఒక్క క్షణం'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈయన మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా వచ్చిన '1971'( బియాండ్‌ దిబోర్డర్స్‌) చిత్రంలో కీలకపాత్ర చేశాడు. ఈ చిత్రం కూడా ఆడలేదు. కాగా ప్రస్తుతం అల్లు శిరీష్‌ మలయాళంలో దుల్కర్‌సల్మాన్‌కి పెద్ద హిట్‌ వచ్చిన 'ఎబిసిడి' చిత్రం రీమేక్‌తో పాటు సూర్య, మోహన్‌లాల్‌లు కలిసి నటించే కెవి ఆనంద్‌ చిత్రంలో కూడా కీలక పాత్రను పోషించనున్నాడు. ఈయన తాజాగా తన 31వ జన్మదినోత్సవం జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అల్లుఅర్జున్‌ ట్వీట్‌ చేస్తూ, 'శిరీష్‌ ఎంత పెద్దవాడైనా నా దృష్టిలో ఇంకా చిన్నపిల్లవాడే. జీవితంలో నా మొదటి బేబీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా కళ్లముందే ఈ బేబీ పుట్టి పెరిగి పెద్దయ్యాడు. నేను ఎక్కువ రహస్యాలు, జ్ఞాపకాలు అతనితోనే పంచుకుంటాను. నా బేబీ, సోదరుడు సిరికి పుట్టినరోజు శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేశాడు. 

ఈ సందర్భంగా శిరీష్‌ తన సోదరుడు బన్నీ, వదిన స్నేహ, వారి పిల్లలతో కలిసి కేక్‌ కట్‌ చేసి బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నాడు. మొత్తానికి ఈ అల్లు వారసుల అన్నాదమ్ముల బంధం మాత్రం చూడముచ్చటగా ఉందనే చెప్పాలి.

Allu Sirish Celebrates His Birthday with Brother's Family:

Allu Arjun Awesome Tweet on His Baby Brother  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement