'రంగస్థలం' రిలీజ్ అయ్యి 50 రోజులు కంప్లీట్ చేసుకున్నందున దాంతో అంతా ఈ సినిమా పని అయిపోయింది అనుకున్నారు. కానీ మెయిన్ సెంటర్స్ తో పాటు బీసీ సెంటర్స్ లో ఈ సినిమాను తీసేయడానికి ఎగ్జిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదని టాక్. దానికి కారణం వీకెండ్స్ లో ఈ సినిమా వసూళ్లు. దాంతో ఈ సినిమా 100 రోజులు కచ్చితంగా కంప్లీట్ చేసుకుంటుందని అనుకుంటున్నారు.
ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో ఒరిజినల్ ప్రింట్ వచ్చిన దాని ప్రభావం దీనిపై మరీ అంతైతే లేదు అని సమాచారం. ప్రస్తుతం చాలా ఏరియాస్ లో నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని తన పేరు మీద వేసుకున్నాడు చిట్టిబాబు. ఈ రెండు నెలలు కాలంలో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చినప్పటికి కేవలం 'భరత్ అనే నేను'-'మహానటి' మాత్రమే 'రంగస్థలం'కు ధీటుగా టాక్ తో పాటు వసూళ్లు తెచ్చుకున్నాయి.
ఏరియాల వారీగా 'రంగస్థలం' టాప్ 3 కంటే ఎక్కడా తక్కువ లేదు. ప్రస్తుతం 125 కోట్ల షేర్ దాటేసిన రంగస్థలం.. ఫుల్ రన్ లో 130 కోట్లు దాటనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా టాలీవుడ్ లో చిట్టిబాబు సౌండ్ కొంచెం గట్టిగానే వినిపిస్తోందని చెప్పాలి.