Advertisementt

రజినీ ఒక్కమాట చెబితే చాలు.. క్రిష్ రెడీ!

Fri 01st Jun 2018 02:32 PM
krish,manikarnika,2.0,rajinikanth,release dates  రజినీ ఒక్కమాట చెబితే చాలు.. క్రిష్ రెడీ!
Krish Waiting For 2.0 Movie Release Date రజినీ ఒక్కమాట చెబితే చాలు.. క్రిష్ రెడీ!
Advertisement
Ads by CJ

శంకర్ - రజినీ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ చిత్రం రోబో '2.ఓ'. ఈ సినిమా గురించి ప్రేక్షకులు పటించుకోవడం మానేశారు. ఎందుకంటే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడడం దానికి కారణం. ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు పోస్టర్స్ రిలీజ్ చేసారు తప్ప దానికి సంబంధించి వీడియో రూపంలో టీజర్స్ కానీ.. ట్రైలర్ కానీ రిలీజ్ చేయలేదు.

ఇక కంగనా రౌనత్ ప్రధాన పాత్రగా ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రను 'మణికర్ణిక' పేరుతో క్రిష్ రూపొందించాడు. ఈ సినిమాను క్రిష్ ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే అదే రోజున రోబో '2.ఓ' చిత్రంని రిలీజ్ చేయాలనీ శంకర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

దాంతో క్రిష్ తన సినిమాను సెప్టెంబర్ కి వాయిదా వేసుకుని ఆ దిశగా ఆ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తీరా చూస్తే '2.ఓ' సెప్టెంబర్ కు వాయిదా పడుతుందనే వార్తలు రావడంతో క్రిష్ తన సినిమాను ముందుగా అనుకున్న ఆగస్టు 15 న విడుదల చేద్దామా అని ఆలోచనల్లో పడినట్టు తెలుస్తుంది. దాంతో '2.ఓ' దర్శక నిర్మాతల నుంచి రానున్న అధికారిక ప్రకటన కోసం క్రిష్ వెయిట్ చేస్తున్నాడట. 

Krish Waiting For 2.0 Movie Release Date:

Krish Manikarnika Release Depends on Rajinikanth 2.0

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ