Advertisementt

గ్యాప్‌ ఇచ్చి మళ్లీ వచ్చిన ఎన్టీఆర్‌ భామ!

Fri 01st Jun 2018 12:29 PM
nivetha thomas,kalyan ram,jai lava kusa,jr ntr,nivetha thomas heroine  గ్యాప్‌ ఇచ్చి మళ్లీ వచ్చిన ఎన్టీఆర్‌ భామ!
Nivetha Thomas Re Entry With Kalyan Ram Film గ్యాప్‌ ఇచ్చి మళ్లీ వచ్చిన ఎన్టీఆర్‌ భామ!
Advertisement
Ads by CJ

అందం, అభినయం రెండు కలబోసిన మంచి హీరోయిన్‌ నివేధాథామస్‌. ఈమెకి ఏకంగా ఎన్టీఆర్‌ నటించిన 'జైలవకుశ'లో ఓ హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి హిట్‌ అయింది. దాంతో ఆమెకి ఇక వరుస అవకాశాలు వస్తాయని, చకచకా సినిమాలు చేస్తుందని అందరు భావించారు. కానీ ఆమె సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. దాంతో ఆమె సినిమాలకు త్వరగానే గుడ్‌బై చెప్పేసి పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. 

కానీ ఆమె నిజానికి పెళ్లి చేసుకోవడం కోసం గ్యాప్‌ ఇవ్వలేదు. తాను చదువుతున్న ఆర్కిటెక్చర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడానికే ఆమె కెరీర్‌కి కాస్త బ్రేక్‌ ఇచ్చింది. ఈ గ్యాప్‌లో ఈమె తన చదువును పూర్తి చేసి తాజాగా మరలా సినిమాలలోకి అడుగుపెట్టింది. నేటిరోజుల్లో ఒక్క హిట్‌ వస్తే చాలు చదువు అన్ని పక్కనపెట్టి దీపం ఉండగానే, క్రేజ్‌ ఉన్నప్పుడే నాలుగైదు సినిమాలు వెనుక వేసుకోవాలని భావించే రోజుల్లో ఈమెకి చదువు మీద ఉన్న శ్రద్దను మెచ్చుకోవాల్సిందే. ఇక ఈమె తమ్ముడు ఎన్టీఆర్‌ నటించిన 'జైలవకుశ' తర్వాత బ్రేక్‌ తీసుకుని తాజాగా అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్న చిత్రం ద్వారా మరలా ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి 'జైలవకుశ' సమయంలోనే నిర్మాత కళ్యాణ్‌రామ్‌ ఆమెతో ఓ చిత్రం చేయాలని భావించి అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడట. 

మాట ప్రకారం ఆమె ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌ హీరోగా గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ అయింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ నైట్‌ పార్ట్‌ జరుగుతోంది. గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మహేష్‌ కోనేరు నిర్మిస్తున్నాడు. ఇక కళ్యాణ్‌రామ్‌ నటించిన 'నానువ్వే' చిత్రం జూన్ 14వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత విడుదలయ్యే కళ్యాణ్‌రామ్‌ చిత్రం గుహన్‌దే కావడం విశేషం. ఈ చిత్రం కూడా ఇదే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Nivetha Thomas Re Entry With Kalyan Ram Film:

Nivetha Thamos Joins Kalyan Ram Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ