పోర్న్‌స్టార్‌గా కెరీర్‌ని ప్రారంభించి, తర్వాత ఇండియా వచ్చి బాలీవుడ్ నుంచి తెలుగు, తమిళం, మలయాళం వంటి ప్రాంతీయ భాషల్లో కూడా క్రేజ్ తెచ్చుకున్న నటి సన్నిలియోన్. ఈమెకి నేడు దేశంలోని స్టార్స్ అందరితో సరిసమానమైన ఇంకా చెప్పాలంటే వారికంటే ఎక్కువ క్రేజే ఉంది. తప్పు చేయడం సహజం. కానీ దానిని తెలుసుకుని పశ్చాత్తాప పడటం, మొండిగా నా ఇష్టం అని వాదించడం తప్పు. ఈ విషయంలో సన్నిని ఎంత మెచ్చుకున్నా తక్కువే.
ఆమె ఇండియా వచ్చిన తర్వాత తాను పోర్న్‌స్టార్‌ని అయినందుకు వేల సార్లు గుండె బద్దలయిందని, తనకి దేవుడు అవకాశం ఇస్తే పోర్న్‌స్టార్ కాకముందు నాడు ఎలా ఉన్నానో అలా కావాలనుకుంటున్నానని చెప్పింది. ఇక ఈమె మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన ఓ పాపను దత్తత తీసుకుని ఆమెకి నిషా అనే పేరు పెట్టుకున్నారు సన్నిలియోన్, వెబర్ దంపతులు. ఆ తర్వాత వారు సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు.
ఇక విషయానికి వస్తే సన్ని ఏడు నెలలుగా కష్టపడుతూ తన కుమార్తె నిషాకి ఓ గిఫ్ట్‌ని తయారు చేసిందట. దీన్ని తయారు చేయడానికి ఏడు నెలలు పట్టింది అని చెబుతూ ఆ కానుకను ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఈ ప్రాజెక్ట్‌ను ఏడునెలల కిందట ప్రారంభించాను. నా కుమార్తె కోసం వేల రంగు రాళ్లను ఈ గిఫ్ట్‌లో పొందుపరిచాను. రాత్రి 1గంటకు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం నమ్మలేకపోతున్నాను. ప్రియమైన నిషా..ఒక్కోరాయిని పొందుపరుస్తున్నప్పుడు నీ పై ప్రేమ గుర్తుచేసుకున్నానని తెలిపింది.