ఈమధ్యన బ్రహ్మనందం నటించిన సినిమాలేవీ ఆడిన సందర్భాలే లేవు. చిన్న పాత్రలు లేవు.. పెద్ద పాత్రలు లేవు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన బ్రహ్మనందానికి ప్రస్తుతం కాలం అస్సలు కలిసిరావడం లెదు. పాతసినిమాలోని ఎక్సప్రెషన్స్ తోనే బ్రహ్మి బోర్ కొట్టించేస్తున్నాడని.... అసలు డైరెక్టర్స్ ఎవరూ బ్రహ్మికి ఒక కేరెక్టర్ ని కూడా తమ సినిమాల్లో సెట్ చేయడంలేదు. అయితే ఇప్పుడు బ్రహ్మి మీద ఒక డైరెక్టర్ పగ తీర్చుకున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ గా వినబడుతుంది.
ఈమధ్యన అంటే తాజాగా బ్రహ్మానందం నటించిన నేల టికెట్టు విడుదలై డిజాస్టర్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు అందరికి ఆశ్చర్యం కలిగించింది. అంతలా ఆశ్చర్యపోవడానికి గల కారణం... ఈ సినిమాలో కేవలం రెండు మూడు సీన్లు మాత్రమే కనిపించి.... అందులోనూ నేల మీద కూర్చుని వెర్రి చూపులు చూసుకుంటూ ఉండే పాత్ర అది. మరి ఇలాంటి పాత్రల రేంజ్ కి బ్రహ్మి పడిపోయాడని కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉండగా.. ఇలాంటి పాత్రని కావాలనే కళ్యాణ్ కృష్ణ బ్రహ్మి కి ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. కళ్యాణ్ కృష్ణ తన తొలి సినిమా సోగ్గాడే చిన్నినాయనలో బ్రహ్మానందానికి నాగార్జున ఆత్మతో మాట్లాడే ఒక కీ రోల్ ఇచ్చాడు.
అయితే సోగ్గాడే చిన్నినాయన షూటింగ్ సమయంలో కళ్యాణ్ కృష్ణని డెబ్యూ మూవీ చేస్తున్న కుర్రాడు అనే ఫీలింగ్ తో బ్రహ్మి బాగా ఇబ్బంది పెట్టాడట. దీంతో కళ్యాణ్ కృష్ణ కడుపులో పెట్టుకుని నేల టికెట్టులో కావాలనే అసలు ఇంపార్టెంట్ లేని పాత్ర ఇచ్చి షూట్ చేసిన వాటిలో కూడా లెంగ్త్ పేరుతో ఎడిట్ చేసి పారేశారనే టాక్ వినిపిస్తుంది. మరి ప్రస్తుతం అవకాశాలు లేక బ్రహ్మానందం వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఇలాంటి ఇంపార్టెంట్ లేని పాత్రలు చెయ్యడమెందుకు అంటూ కొందరు సెటైర్స్ వేస్తుండగా... నేల టికెట్టు సినిమా ఎలాగూ పోయింది.. బ్రహ్మికి పేరు రాకపోతే పెద్ద నష్టం లేదులే అంటున్నారు.